twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మల్లీశ్వరికి మ్యూజిక్ చేస్తున్నానా అనే ఫీలింగ్.. శ్రేయా ఘోషల్ కంటే గొప్పగా పాడింది.. ఆర్మీ

    |

    ఎంకి నాయుడు బావ సృష్టికర్త నండూరి సుబ్బారావు రాసిన పాటలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ గొప్ప కార్యచరణతో ముందుకెళ్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ సహకారంతో ఎంకిపాట ఆర్పీ నోట అనే ఆల్బమ్‌ను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ఈ ఆల్బమ్‌ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయిన సందర్భంగా ఆర్పీ పట్నాయక్ తన బృందంతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఆల్బమ్‌లో ఎంకీగా నటిస్తున్న అంతశీల, నాయుడు బావ పాత్రను పోషిస్తున్న ప్రాణం ఖరీదు ఫేం ప్రశాంత్ రెడ్డిని పరిచయం చేశారు. ఆల్బమ్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

     నండూరి సుబ్బారావు గొప్ప ప్రయోగం

    నండూరి సుబ్బారావు గొప్ప ప్రయోగం

    1917-18 సంవత్సరాల మధ్య మద్రాస్ క్రిస్టియన్ కాలేజిలో నండూరి సుబ్బారావు న్యాయశాస్త్రం చదువుతున్నారు. ఆ సమయంలో ట్రాంబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఆయన మదిలో గుండెలో గొంతుకలో కొట్లాడుతుందనే ప్రయోగాన్ని నండూరి చేశారు. అప్పటి నుంచి తెలుగు వారి జీవితంలో భాగమయ్యాయి.

    ఎంకి పాట ఆర్పీ నోట అనే ఆల్బమ్‌లొ

    ఎంకి పాట ఆర్పీ నోట అనే ఆల్బమ్‌లొ

    నండూరి రాసిన 78 పాటలు వందేళ్ల తర్వాత కూడా మాట్లాడే అంతగా ఓ వటవృక్షంలా ఎదిగాయి. ఆయన రాసిన పాటలను ఎంకి పాట ఆర్పీ నోట అనే ఆల్బమ్‌ను మొదలు పెట్టాను. భక్తిరసానికి అన్నమయ్య ఎంత గొప్పనో.. ప్రేమ, శృంగారానికి సంబంధించి అంత గొప్పగా ఈ ఆల్బమ్ ఉంటాయి అని ఆర్మీ అన్నారు.

    మల్లీశ్వరీకి కంపోజ్ చేస్తున్న ఫీలింగ్

    మల్లీశ్వరీకి కంపోజ్ చేస్తున్న ఫీలింగ్

    ఎంకీ, నాయుడు బావ మధ్య ఉన్న ప్రేమ కథ ఓ అద్భుతం. నేను ఈ పాటలు చేస్తున్నప్పుడు ఎన్టీఆర్, భానుమతి కలిసి నటించిన మల్లీశ్వరి సినిమాకు సంగీతం చేస్తున్నట్టు అవకాశం వచ్చిందా అనే గొప్ప ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే అంత అద్భుతమైన సాహిత్యం, ప్రేమ గొప్పగా ఉంటుందా? ప్రేమలో ఇంత గొప్పగా ఎక్స్‌ప్రెషన్ ఉంటుందా అనే భావన నాకు ఈ సందర్భంగా కలిగింది.

    రెండు తరాలకు దూరమైంది

    రెండు తరాలకు దూరమైంది

    తెలుగు సాహిత్యంలో ఎంతో గొప్ప ప్రాధాన్యం ఉన్న ఎంకి నాయుడు బావ పాటలు రెండు తరాలకు దూరమయ్యాయి. అందుకే రానున్న తరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాను. నాకు సహకారం అందిస్తున్న ఆదిత్య మ్యూజిక్ సంస్థకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఈ ప్రాజెక్ట్‌కు మా అన్నయ్య గౌతమ్ పట్నాయక్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

     శ్రేయాల్ ఘోషల్ కంటే గొప్పగా పాడింది

    శ్రేయాల్ ఘోషల్ కంటే గొప్పగా పాడింది

    నాయుడు బావకు నేను గళం అందిస్తుండగా.. ఎంకీ పాటకు నండూరి సుబ్బారావు మునిమనవరాలు శృతి పాడుతున్నారు. నండూరి శృతిని ఎంపిక చేసుకోవడానికి కాపీరైట్స్ ఇష్యూ కాదు. శృతి గొప్ప గాయని. ఆమె శ్రేయా గోషల్ కంటే గొప్పగా పాడింది. ఆమె ఎంత గొప్పగా పాడిందో మీరే చూస్తారు. అమెరికాలో ఉండే ఆమె వాయిస్‌ను స్కైప్ ద్వారా రికార్డింగ్ చేశాం. ఉగాది రోజున ఏప్రిల్ 11న మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తాం. ఎన్నికల తర్వాత ఆడియోను రిలీజ్ చేస్తాం అని ఆర్పీ పట్నాయక్ తెలిపారు.

    English summary
    RP Patnaik started Nanduri Subba Rao's enki nayudi bava album. Nanduri Shruti giving a voice for Enki, RP giving voice for Nayudu Bava. In this occassion, RP released first look of Album.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X