twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR Mass Anthem దుమ్మురేపుతున్న నాటు నాటు సాంగ్.. మాస్ స్టెప్పులతో ఇరుగదీసిన రాంచరణ్, ఎన్టీఆర్

    |

    దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తున్న చిత్రం RRR. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే జనవరి మొదటి మాసంలో రిలీజ్ కానున్న ఈ చిత్ర ప్రమోషన్స్‌ను జోరుగా మొదలుపెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్ రిలీజ్ చేయగా కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సాంగ్‌కు సంబంధించిన విశేషాలు ఏమిటంటే..

    ఊర మాస్ స్టెప్పులతో నాటు నాటు

    ఊర మాస్ స్టెప్పులతో నాటు నాటు

    ఎన్టీఆర్, రాంచరణ్‌పై రాజమౌళి చిత్రీకరించిన నాటు నాటు పాట ఊర మాస్ సాహిత్యంతో అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, రాహుల్ సిప్లిగంజ్, కాలభరవ పాడారు.. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. రిలీజైన కొద్ది గంటల్లోనే 1,342,513 వ్యూస్ సాధించడం విశేషంగా మారింది.

    చంద్రబోస్ రాసిన, రాహుల్, భైరవ నాటు పాట ఇదే..

    చంద్రబోస్ రాసిన, రాహుల్, భైరవ నాటు పాట ఇదే..

    పొలంగట్టు దుమ్ములోన
    పోట్లగిత్త దూకినట్టు
    పోలేరమ్మ జాతరలో
    పోతరాజు ఊగినట్టు
    కిర్రు సెప్పులేసుకూని
    కర్రసాము సేసినట్టు
    మర్రిసెట్టు నీడలోన
    కుర్రగుంపు కూడినట్టు
    ఎర్రజొన్న రొట్టెలోన
    మిరప తొక్కు కలిపినట్టు
    నా పాట సూడు నా పాట సూడు
    నా పాట సూడు నా పాట సూడు
    నాటు నాటు నాటు నాటు నాటు నాటు
    నాటు నాటు నాటు
    పచ్చి మిరపలాగ పిచ్చనాటు
    నాటు నాటు నాటు
    పిచ్చుకత్తి లాగ వెర్రినాటు
    గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్టు
    సెవులు సిల్లుపడేలాగ కీసుపిట్ట కూసినట్టు
    ఏలు సిటికెలేసేలా యవ్వారం సాగినట్టు
    కాలు సిందు తొక్కకేలా దుమ్మారం రేగినట్టు
    ఒళ్లు సెమటపట్టేలా వీరంగం సేసినట్టు
    నా పాట సూడు నా పాట సూడు
    నా పాట సూడు
    నాటు నాటు నాటు
    వీర నాటు
    నాటు నాటు నాటు
    ఊర నాటు
    నాటు నాటు నాటు
    గడ్డపార లాగ
    చెడ్డ నాటు
    నాటు నాటు నాటు
    ఉక్కపోత లాగ తిక్క నాటు
    భూమి దద్దరిల్లేలా
    ఒంటిలోన రగతమంతా
    రంకలేసి ఎగిరేలా
    ఏసేయరో ఎకాఎకి
    నాటు నాటు నాటు
    దుమ్మ దుమ్ము దులిపేలా
    లోపలున్న పానమంతా
    దుముకు దుముకు లాడేలా
    దూకేయరో సరాసరి
    నాటు నాటు నాటు
    నాటు నాటు నాటు

    ప్రేమ్ రక్షిత్ మాస్ స్టెప్పులతో దడదడ

    ప్రముఖ డ్యాన్స్ డైరెక్టర్ ప్రేమ్ రక్షిత్ నృత్యాలు సమకూర్చిన నాటు నాటు పాటకు రెచ్చిపోయి రాంచరణ్, ఎన్టీఆర్ స్టెప్పులు వేశారు. మాస్ స్టెప్పులతో దుమ్మురేపుతూ శివతాండవడం చేశారా అనేంతగా డ్యాన్స్ చేసి మైమరిపించారు. ఎన్టీఆర్, రాంచరణ్ వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

    1000 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్

    1000 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్

    RRR మూవీ విషయానికి వస్తే.. సుమారు 400 కోట్ల రూపాయలతో తెరకెక్కింది. తెలుగు సినిమా చరిత్రలో గతంలో లేని విధంగా స్టార్ హీరోలు, సాంకేతిక నిపుణులతో తెరక్కెకించారు. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు, లవ్ ట్రాక్ సరికొత్తగా ఉంటాయనే విషయాన్ని చిత్ర యూనిట్ పలు సందర్బాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లకుపైగానే జరిగినట్టు తెలుస్తున్నది.

    Recommended Video

    Pushpa The Rise US Premieres Plans | Allu Arjun కెరీర్ లో ఫస్ట్ టైమ్..!! || Filmibeat Telugu
    RRRలో నటీనటులు: సాంకేతిక నిపుణులు

    RRRలో నటీనటులు: సాంకేతిక నిపుణులు

    నటీనటులు: ఎన్టీఆర్, రాంచరణ్, అజయ్ దేవగన్, అలియా భట్, శ్రీయ సరన్, ఓలియా మోరిస్, అలిసన్ డూడీ,, రే స్టీవెన్‌సన్ తదితరులు
    దర్శకత్వం: ఎస్ఎస్ రాజమౌళి
    నిర్మాత: డీవీవీ దానయ్య
    డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
    సినిమాటోగ్రఫి: కేకే సెంథిల్ కుమార్
    ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్
    మ్యూజిక్: ఎంఎం కీరవాణి
    గాయకులు: రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ
    డ్యాన్స్: ప్రేమ్ రక్షిత్
    బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్
    క్యాస్టూమ్ డిజైనర్: రమా రాజమౌళి
    సమర్పణ: డీవీవీ పార్వతి
    డిస్ట్రిబ్యూషన్: లైకా ప్రొడక్షన్స్ (తమిళం), పెన్ స్టూడియోస్ (నార్త్)
    రిలీజ్ డేట్: 2021-10-13

    English summary
    SS Rajamouli's RRR second Single Naatu Naatu Song released. It goes viral after release. This song got 1,342,513 view in Lahari music youtube channel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X