For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Saranga Dariyaతో సాయి పల్లవి రికార్డు: సౌత్ ఇండియాలోనే మొదటి స్థానం

  |

  అక్కినేని వారసుడు యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా.. టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన చిత్రం 'లవ్ స్టోరీ'. వరుణ్ తేజ్‌తో చేసిన 'ఫిదా' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తైపోయింది. కానీ, కరోనా ప్రభావం కారణంగా థియేటర్లు మూతపడడంతో దీన్ని అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేకపోయారు. దీంతో ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులతో పాటు సాయి పల్లవి ఫ్యాన్స్ మరింత ఎక్కువ కాలం నిరీక్షించాల్సి వస్తోంది.

  జాకెట్ తీసేసి బాలయ్య హీరోయిన్ బోల్డ్ షో: అందాల ఆరబోతలో పట్టా తీసుకుందా ఏంటి!

  'లవ్ స్టోరీ' మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు చాలా రోజులు క్రితమే ప్రారంభించారు. ఇందులో భాగంగానే పలు రకాల పోస్టర్లు, టీజర్, పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేశారు. వీటన్నింటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. అన్నింటి కంటే ముఖ్యంగా ఇందులోని 'సారంగ దరియా' అంటూ సాగే ఓ ఫోక్ సాంగ్‌కు ఊహించని రీతిలో రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా ఈ పాట యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అద్భుతమైన పాట మరో అరుదైన మైలురాయిని చేరుకుని ఓ ఘనతను కూడా అందుకుంది.

  Sai Pallavi Saranga Dariya Song Reach 300Million Views

  'దాని కుడీ భుజం మీద కడువా... దాని పుస్తెపు రైకలు మెరియా... అది రమ్మంటె రాదు సెలియా.. దాని పేరే సారంగ దరియా' అంటూ సాగే ఫోక్ సాంగ్‌లో సాయి పల్లవి అదిరిపోయే స్టెప్పులతో అలరించింది. దీంతో ఈ పాట తాజాగా 300 మిలియన్ వ్యూస్ మార్కును చేరుకుంది. తద్వారా ఈ ఘనతను అందుకున్న అతి తక్కువ పాటల్లో ఒకటిగా నిలిచింది. అన్నింటి కంటే ముఖ్యంగా వేగంగా 300 మిలియన్ వ్యూస్ రాబట్టిన తొలి సౌతిండియా సాంగ్‌గా 'సారంగ దరియా' రికార్డు క్రియేట్ చేసింది. దీని తర్వాతి స్థానంలో కూడా సాయి పల్లవి పాట 'రౌడీ బేబీ' ఉండడం విశేషం.

  గ్లామర్ షోతో సెగలు రేపుతోన్న అల్లు అర్జున్ ఏంజెల్: అదిరిపోయే ఫోజులతో అదరగొడుతోన్న బ్యూటీ

  తెలంగాణ పల్లె పదాలతో రూపొందిన 'సారంగ దరియా' పాటను పవన్ సీహెచ్ కంపోజ్ చేయగా.. మంగ్లీ ఆలపించింది. అలాగే, సుద్దాల అశోక్ తేజ దీనికి లిరిక్స్ అందించారు. ఇక, ఈ పాట విడుదలైన సమయంలో కోమలి అనే ఫోక్ సింగర్ వివాదాన్ని రేపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెతో శేఖర్ కమ్ముల చర్చలు జరపడంతో ఆమె సైలెంట్ అయిపోయారు. ఇక, సినిమాలో ఈ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ కాబోతుందని దాన్ని చూస్తేనే అర్థం అవుతోంది. దీంతో ఈ పాటపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'లవ్ స్టోరీ'లో అక్కినేని నాగ చైతన్య డ్యాన్స్ మాస్టర్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది విషాదాంతమైన ప్రేమకథతో తెరకెక్కినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.

  English summary
  Naga Chaitanya and Sai Pallavi Doing Love Story Movie Under Sekhar Kammula Direction. In This Film Saranga Dariya Song Reach 300Million Views.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X