Samantha చేతులు మీదుగా పూరీ జగన్నాథ్ తనయుడి పాట.. నూనుగు మీసాల ఆకాశ్ పూరి కోసం హీరోయిన్ ఆరాటం..
సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం చోర్ బజార్. దళం, జార్జ్ రెడ్డి చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకొన్న జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నది. లవ్, యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఐవీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మిస్తున్నారు.
త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషనల్ సాంగ్‌ను ఇటీవల సౌత్ సూపర్ స్టార్ సమంత రుత్ ప్రభు చేతులు మీదుగా రిలీజ్ చేయించారు. సమంత రిలీజ్ చేసిన నూనుగు మీసాల లిరికల్ సాంగ్‌కు యూట్యూబ్‌లో భారీ రెస్పాన్స్ వస్తున్నది. నూనుగు మీసాల సాంగ్ హీరోయిన్‌పై చిత్రీకరించిన సోలోసాంగ్ కావడం గమనార్హం.

నూనుగు మీసాల పోరడు చూడు
ఎదురు సూరీడే, నామీద నజర్ ఏసిండే
రంగుల డబ్బాల గుండెను ముంచి ఎత్తుకపోయిండే,
వాని గుండెల్ల దాచిండే,
వాని బొమ్మ గీసి, మాటా ముచ్చట చెప్పుకున్న గాలిలో,
వాణ్ని చేరితే చాలయ్యో,
మళ్లొస్తడాని బాట మీద కూసోనున్న
ఎవరన్నా జెర చెప్పిపోండయ్యో .అంటూ సాగే పాటకు స్టార్ రైటర్ కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. యువ సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. లక్ష్మీ మేఘన పాడగా.. భాను కొరియోగ్రఫి అందించారు.
సాంకేతిక నిపుణులు
సినిమాటోగ్రఫి: జగదీష్ చీకటి
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఎడిటింగ్: అన్వర్ అలీ, ప్రభు దేవా
ఆర్ట్: గాంధీ నడికుడికర్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం
సౌండ్ డిజైనర్: సాయి మనీందర్ రెడ్డి
ఆడియో: లహరి
కాస్ట్యూమ్స్ డిజైనర్: ప్రసన్న దంతులూరి
ఫైట్స్: ఫృథ్వీ శేఖర్
కొరియోగ్రఫి: భాను,
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను
స్టిల్స్: వికాస్ సీగు
పీఆర్వో: జీఎస్కే మీడియా
సహ నిర్మాత: అల్లూరి సురేష్ వర్మ
బ్యానర్: ఐవీ ప్రొడక్షన్స్
నిర్మాత: వీఎస్ రాజు
రచన, దర్శకత్వం - బి. జీవన్ రెడ్డి.


Click it and Unblock the Notifications











