Don't Miss!
- Finance
Holidays in February: ఫిబ్రవరిలో 10 రోజులు బ్యాంక్స్ క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..?
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- News
పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు - కీలక నిర్ణయం..!?
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
Grammy Awards 2022 భారతీయ, పాకిస్థానీ మహిళలకు పురస్కారం.. ఏఆర్ రెహ్మాన్ సెల్ఫీ వైరల్
ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల కార్యక్రమం అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి లాస్ వెగాస్‌లో ఘనంగా ముగిసాయి. ఈ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రపంచంలో ప్రతిభావంతులు పాల్గొన్నారు. ఈ వేడుకలో జస్టిన్ బీబర్, లేడి గాగ, బీటీఎస్ టీమ్ లాంటి పాపులర్ మ్యూజిక్ లెజెండ్స్ ఈ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రెవర్ నోహ హోస్ట్‌గా వ్యవహరించిన 64వ అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన విశేషాలు ఏమిటంటే..

పాకిస్థానీ మహిళకు అవార్డు
పాకిస్థాన్‌కు చెందిన గాయని అర్జూ అఫ్తాబ్ తన దేశం తరపున తొలి గ్రామీ అవార్డును అందుకొన్నారు. ఈ అవార్డును అందుకొన్న తొలి పాకిస్థాని మహిళగా ఘనతను సాధించారు. బెస్ట్ గ్లోబల్ ఫెర్ఫార్మెన్స్ క్యాటగిరీలో మొహబ్బత్ అనే పాటకు ఈ అవార్డును అందుకొన్నారు.

బీటీఎస్ వీ రొమాంటిక్‌గా
గ్రామీ అవార్డుల కార్యక్రమంలో బీటీఎస్ టీమ్ సభ్యుడు వీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకల్లో తాజా మ్యూజిక్ సంచలనం ఒలివియా రోడ్రిగో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
బీటీఎస్‌కు సంబంధించిన బటర్ ఆల్బమ్ ప్రదర్శనకు ముందు వీ, ఒలివియా ఇద్దరు గుసగుసలాడుతూ కనిపించారు. ఒలివియా చెవిలో వీ గుసగుసలాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. వీ చెవిలో ఏదో చెబుతుంటే.. ఒలివియా చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది.

హైలెట్‌గా జస్టీన్ బీబర్ లైవ్ షో
64వ గ్రామీ అవార్డుల కార్యక్రమంలో జస్టిన్ బీబర్ ప్రదర్శన హైలెట్‌గా నిలిచింది. పీచేస్ అనే ఆల్బమ్‌పై జస్టిన్ బీబీర్ ప్రదర్శనకు మంచి రెస్పాన్స్ లభించింది. ఆడియెన్స్‌లో కూర్చొని ఉన్న బీబీర్ భార్య హైలీ బీబర్ ఉత్సాహంగా తన భార్తకు సపోర్టుగా చీర్స్ చెప్పింది.

ఏఆర్ రెహ్మాన్ సెల్ఫీ వైరల్
ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల వేడుకల్లో సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అతిథుల మధ్య నుంచి ఏఆర్ రెహ్మాన్స్ ఉత్సాహంగా కనిపించారు. ఆడిటోరియానికి సంబంధించిన బ్యాక్ డ్రాప్‌తో తన స్నేహితులతో కలిసి రెహ్మాన్ సెల్పీ తీసుకొన్నాడు. ప్రస్తుతం ఆ సెల్పీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

భారతీయ గాయనికి అవార్డు
గ్రామీ అవార్డుల వేడుకలో భారతీయ గాయని ఫాలుకు అరుదైన గౌరవం దక్కింది. ఏ కలర్‌ఫుల్ వరల్డ్ అనే పాటకు బెస్ట్ చిల్డ్రన్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు దక్కింది. ఈ క్యాటగిరాలో 123 ఆండ్రేస్, పియర్స్ ఫ్రీలాన్, లక్కా డియాజ్, ది ఫ్యామిలీ జామ్ బ్యాండ్స్ లాంటి వాళ్లు నామినేట్ అయ్యారు.