For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Hey Rambha Lyrical: అదిరిన మహాసముద్రం సాంగ్.. చాలా రోజుల తర్వాత రంభ అలా!

  |

  గతంలో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా రూపొందుతున్నాయి. సినిమాను చూసే ప్రేక్షకులు, హీరోల అభిమానుల అభిరుచిలో మార్పులు రావడంతో పాటు కొత్త తరహా కథలను కోరుకుంటున్నారు. దీనికి తోడు హీరోలు కూడా ఈ తరహా చిత్రాల్లో నటించేందుకు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఈ కారణంగానే మల్టీస్టారర్ మూవీలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌లో ఇలాంటివి ఎన్నో మూవీలు రూపుదిద్దుకున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం మరిన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో 'మహాసముద్రం' ఒకటి.

  టాలెంటెడ్ హీరో శర్వానంద్.. హ్యాండ్సమ్ గాయ్ సిద్దార్థ్ హీరోలుగా 'RX100' ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రమే 'మహాసముద్రం'. సన్నితమైన ప్రేమకథకు భావోద్వేగాలను జోడించి ఈ సినిమాను రూపొందించారు. ఎప్పుడో మొదలైన ఈ చిత్ర షూటింగ్.. ఇటీవలే పూర్తైంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా మొదలెట్టి దాదాపుగా కంప్లీట్ చేసేశారు. ఇక, ఇప్పుడు విడుదలకు సమయం దగ్గర పడడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్‌ను వదులుతున్నట్లు ప్రకటించారు.

  గ్లామరస్ ఫొటోలతో అను ఇమాన్యూయేల్ రచ్చ: గతంలో ఎన్నడూ చూడని ఫోజులతో కవ్విస్తోన్న బ్యూటీ

  Sharwanand and Siddharths Mahasamudram Hey Rambha Rambha Lyrical Released

  మల్టీస్టారర్ మూవీగా రాబోతున్న 'మహాసముద్రం' నుంచి తాజాగా 'హేయ్ రంభ రంభ' అనే సాంగ్ విడుదలైంది. చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన ఈ పాటను అతడే స్వయంగా ఆలపించాడు. ఈ సాంగ్‌కు భాస్కర భట్ల లిరిక్స్ అందించారు. అలాగే, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దీనికి నృత్య దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన ఈ పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులోని లిరిక్స్, పాడిన విధానం చాలా బాగుంది. ఇందులో శర్వానంద్‌తో పాటు సీనియర్ హీరో జగపతిబాబు కూడా కాళ్లు కదిపారు. ఇక, ఇందులో సీనియర్ హీరోయిన్ రంభను బాగా హైలైట్ చేశారు. ఆమె కటౌట్లతోనూ స్టెప్పులు వేయించారు. తద్వారా ఆ బ్యూటీని ప్రేక్షకులకు గుర్తు చేయడంతో పాటు ఆమెకు సరైన డెడికేషన్ ఇచ్చారు.

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'మహాసముద్రం' సినిమాను డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కించాడు అజయ్ భూపతి. ఇద్దరు స్నేహితుల మధ్య ప్రేమ చిచ్చు పెట్టి.. వాళ్లను శత్రువులుగా మార్చేసిందన్న కాన్సెప్టుతో ఇది రూపొందినట్లు తెలుస్తోంది. ఎమోషనల్‌గా సాగే ఈ సినిమాలో అదితి రావ్‌ హైదరీతో పాటు అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఆ తేదీ మారే అవకాశాలు కూడా ఉన్నాయి.

  వాస్తవానికి 'మహాసముద్రం' సినిమాను స్టార్ హీరోలతో తీయాలని అజయ్ భూపతి భావించాడు. ఇందుకోసం ఎంతో మంది స్టార్లకు కథను కూడా వినిపించాడు. కానీ, బడా హీరోలెవరూ దీనికి డేట్స్ కేటాయించలేకపోయారు. అందుకే ఇది మొదలవడానికి చాలా సమయం పట్టింది. ఈ క్రమంలోనే టాలెంటెడ్ హీరో శర్వానంద్.. హ్యాండ్సమ్ గాయ్ సిద్దార్థ్‌లను హీరోగా ఎంపిక చేసుకున్నాడు దర్శకుడు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Sensational Director Ajay Bhupathi Now Doing Mahasamudram Movie with Sharwanand and Siddharth. Now Hey Rambha Rambha Lyrical Released From This Movie
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X