Don't Miss!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Sports
India vs Australia అహ్మదాబాద్ టెస్ట్‌కు భారత ప్రధాని
- News
దానిని మేం కాదనడంలేదుగా: సజ్జల రామకృష్ణారెడ్డి
- Finance
Income Tax: ప్రభుత్వ ఉద్యోగులకు ఏ పన్ను విధానం మేలు.. అలా జంపింగ్ కుదరదా..?
- Lifestyle
Garuda Purana: ఈ చోట్ల భోజనం చేస్తే లేని పాపాలు అంటుకుంటాయి, అవేంటో తెలుసుకోండి
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
YS Jagan యాటిట్యూబ్ మార్చుకో.. విడగొట్టే పద్దతి వద్దు.. ఏపీ సీఎంకు ప్రముఖ సింగర్ చురకలు
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన RRR చిత్రం ప్రపంచ వేదికలపై అపూర్వ ఆదరణను సొంతం చేసుకొంటున్నది. విదేశాల్లో పలు ప్రముఖ అవార్డులను సొంతం చేసుకొంటూ ఆస్కార్ అవార్డుపై గురిపెట్టింది. తాజాగా అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డు సొంతం చేసుకొన్నది. ఈ సందర్భంగా RRR చిత్ర యూనిట్‌కు అన్ని రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్ర యూనిట్‌ను సోషల్ మీడియా ద్వారా అభినందించారు. అయితే వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌పై పాకిస్థాన్ సింగర్ అద్నాన్ సమీ అసంతృప్తిని వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. దాంతో కొత్త వివాదానికి తెరలేపిన అద్నాన్ సమీ ట్వీట్ వివరాల్లోకి వెళితే..
RRR చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డును ఎంఎం కీరవాణి అందుకొన్న నేపథ్యంలో అభినందనలు తెలియజేస్తూ.. ప్రపంచ సినిమా రంగంలో తెలుగు జెండా రెపరెపలాడుతున్నది. ఈ సందర్భంగా కీరవాణి, రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్, చిత్ర యూనిట్‌కు నా కంగ్రాట్యులేషన్. మీరు సాధించిన ఘనతను చూసి మేము గర్వంగా ఫీలవుతున్నాం అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ చేసిన ట్విట్‌కు జూనియర్ ఎన్టీఆర్, ఇతర నటీనటులు థ్యాంక్యూ చెప్పారు.

ఇదిలా ఉండగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, పాక్ సంతతికి చెందిన భారతీయ పౌరుడు అద్నాన్ సమీ ట్వీట్ చేశారు. తెలుగు జెండానా? మీ ఉద్దేశం భారతీయ జెండా అనా? ముందుగా మనం భారతీయులం. దేశం నుంచి మీరు సపరేట్ అయ్యే ప్రయత్నాలు ఆపండి. ప్రత్యేకించి.. ఇంటర్నేషనల్‌గా చూసుకొంటే.. మనమంత ఒక దేశానికి చెందిన పౌరులం. ఇలా విడగొట్టడమనే యాటిట్యుబ్ మనకు మంచి కాదు. 1947లో దేశాన్ని విడగొడితే ఏం జరిగిందో మీకు తెలుసు. థ్యాంక్యూ.. జై హింద్ అంటూ అద్నాన్ సమీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
అంతేకాకుండా భారతదేశానికి తెలుగు సినిమా గర్వకారణంగా నిలిచిందని రాసి ఉంటే బాగుండేది. అది వాస్తవంగా కరెక్ట్ అనిపించేది. ఎందుకంటే అది నిజం కాబట్టి అని మరో ట్విట్‌లో తన అభిప్రాయాలను అద్నాన్ సమీ వెల్లడించారు.
గాయకుడు అద్నాన్ సమీ కెరీర్ విషయానికి వస్తే.. తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితులు శంకర్ దాదా ఎంబీబీఎస్, వర్షం, యువ, మహానది, యోగి, ఆడవారి అర్ధాలకు అర్ధాలే వేరులే. శంకర్ దాదా జిందాబాద్, పవర్, బెంగాల్ టైగర్, 90ఎంఎల్, ఇంకా పలు చిత్రాల్లో పాటలు పాడిన విషయం తెలిసిందే.