‘రంగమార్తాండ’ కోసం రంగంలోకి.. సిరివెన్నెలపై కృష్ణవంశీ పోస్ట్
కృష్ణవంశీ సినిమాలు వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేసి చాలా కాలమే అయింది. వరుస ఫ్లాపులతో కృష్ణవంశీ ఢీలా పడ్డాడు. చాలా గ్యాప్ తీసుకుని మళ్లీ తన సత్తాను చాటాలని ఓ మంచి కథనుఎంచుకున్నాడు. మరాఠీలో హిట్ అయిన సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నాడు. కృష్ణవంశీ రంగమార్తాండ అనే టైటిల్‌ను ప్రకటించినప్పటి నుంచి సినిమాపై అంచనాలు పెరిగాయి.
పైగా ఇందులో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, అనసూయ వంటి వారెంతో మంది నటిస్తున్నారు. వీరిపై బిగ్ బాస్ ఫేమ్ రాహుల్, అలీ రెజాలు కూడా నటించారు. ఆ సినిమా ప్రారంభం సమయంలో బిగ్ బాస్ మంచి ఊపులో ఉంది. అందుకే వీరు బయటకు వచ్చాక వీరి సరిపోయే పాత్రలను ఇచ్చాడు కృష్ణవంశీ. మొత్తానికి షూటింగ్ అప్డేట్లు ఇవ్వకుండానే అంతా సైలెంట్‌గానే చేసేస్తున్నాడు. తాజాగా రంగమార్తాండ పాటల సిట్టింగ్స్ గురించి చెప్పుకొచ్చాడు.

కృష్ణవంశీ సినిమాలంటే పాటలు, అందులోని సాహిత్యం ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంటుంది. సినిమా హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా పాటలు క్లాసిక్‌గా మిగిలిపోతాయి. కృష్ణవంశీ సినిమాలకు దాదాపు సిరివెన్నెల సీతారామశాస్త్రియే పాటలు రాస్తుంటారు. తాజాగా రంగమార్తాండ కోసం సిరివెన్నెల రంగంలోకి దిగారు. ఈమేరకు కృష్ణవంశీ ట్వీట్ వేశాడు. గురూజీ ప్రారంభించేశారు.. అద్భుతమైన లైన్స్ వస్తున్నాయంటూ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











