సురేష్ ప్రొడక్షన్స్ లో మరొక కొత్త బిజినెస్.. ఇక నుంచి మ్యూజిక్ కూడా..
ఇండియన్ సినిమా చరిత్రలోనే 50 ఏళ్లుగా కొనసాగుతున్న బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌజ్ లలో సురేష్ ప్రొడక్షన్స్ ఒకటి. నిర్మాత D.రామానాయుడు స్థాపించిన ఈ సంస్థలో ఇప్పటివరకు122 సినిమాలను నిర్మించారు. కేవలం తెలుగులోనే కాకుండా దాదాపు అన్ని ఇండియన్ భాషల్లో సినిమాలను రూపొందించారు. రామానాయుడు అనంతరం ప్రస్తుతం సంస్థ బాధ్యతను సురేష్ బాబు చూసుకుంటున్నారు.
ఇక ఇన్నాళ్లకు సురేష్ బాబు మరొక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. SP సంస్థలో ఇక నుంచి సినిమాలతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్ కూడా ఉంటుందని అధికారికంగా వివరణ ఇచ్చారు. దాదాపు 120 సినిమాలకు పైగా నిర్మించిన సురేష్ ప్రొడక్షన్స్ ఆ సినిమాలకు సంబంధించిన మ్యూజిక్ తో పాటు బయట సంస్థల నుంచి కూడా ఆడియో హక్కులని అందుకోనుంది. మ్యూజిక్ ఫ్లాట్ ఫార్మ్ లో కూడా సరికొత్తగా నడవాలని అనుకుంటున్నట్లు సురేష్ బాబు తెలియజేశారు.

ఇక ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ లో రానా దగ్గుబాటి, వెంకటేష్, నాగచైతన్య కంటిన్యూగా సినిమాలు చేస్తున్నారు. చివరగా ఈ బ్యానర్ లో వచ్చిన ఓ బేబి, వెంకీ మామ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందుకున్నాయి. ఇక నారప్ప, దృశ్యం 2 సినిమాలు కూడా విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. అలాగే రానా హీరోగా సురేష్ బాబు ఒక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాని నిర్మించాలని అనుకుంటున్నారు. అందుకోసం గుణశేఖర్ తో హిరణ్యకశిప స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేశారు. గుణశేఖర్ శాకుంతలం సినిమా అనంతరం ఆ ప్రాజెక్టు సెట్స్ పైకి రానుంది.


Click it and Unblock the Notifications











