Don't Miss!
- Finance
PMCares: PMCares రాజ్యాంగబద్ధమా ? RTI కిందకు వస్తుందా ? విరాళాల సంగతేంటి..??
- News
ఈటలపై అభ్యర్థి ఫిక్స్: ప్రకటించిన కేటీఆర్; గెల్లు శ్రీనివాస్ కు షాక్!!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన తమన్.. మొదటిసారి ఆ అగ్ర హీరోతో యాక్షన్ మూవీ!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బిజీ బిజీ గా కనిపిస్తున్న అతికొద్ది మంది సంగీత దర్శకులలో థమన్ ఒకరు. గత కొంతకాలంగా తమన్ గ్యాప్ లేకుండా వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలతో ఫుల్ బిజీ గా కనిపిస్తున్నాడు. మెగాస్టార్ నుంచి సూపర్ స్టార్ వరకు అందరి హీరోలకు సంగీతం అందించడానికి ఒక ప్రత్యేకమైన ట్రాక్ ను సెట్ చేసుకుంటున్నాడు. అయితే తమను ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా అతనికి ఆఫర్స్ అయితే తగ్గడం లేదు..ఒక విధంగా గతంలో కంటే ఎక్కువగా సినిమాలు కూడా చేస్తున్నాడు. అలాగని ప్రతి సినిమా చేయడానికి ఒప్పుకోవడం లేదట.
కథ నచ్చకపోతే వెంటనే మొహం మీదే తెప్పిస్తున్నాడట. సినిమా కథ నచ్చితేనే ఆ తర్వాత సాంగ్స్ కంపోజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అల వైకుంఠపురములో హిట్ అయిన తర్వాత థమన్ లో చాలా మార్పు వచ్చింది. అతను ఎలాంటి సినిమాలకైనా సరే సంగీతం అందించగలరని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా మ్యూజిక్ అందించాడు.
ఆ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ ఏడాది మొదట్లో వచ్చిన క్రాక్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక అప్పటి నుంచి కూడా ఆఫర్ల సంఖ్య అయితే గట్టిగానే పెరుగుతోంది. ఇక అతను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన ఆఫర్స్ కూడా చాలానే వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో థమన్ ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఫైనల్ గా వకీల్ సాబ్ సినిమాతో మంచి అవకాశం రావడంతో అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా సరైన మ్యూజిక్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నాడు.

అందులో కూడా కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండటంతో అభిమానులకు నచ్చే విధంగా మాస్ సాంగ్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా త్వరలోనే మ్యూజిక్ స్టార్ట్ చేయబోతున్న థమన్ ఇటీవల శంకర్ రామ్ చరణ్ సినిమాకు చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అన్ని వైపులా హీరోలను కవర్ చేస్తున్న థమన్ త్వరలోనే కోలీవుడ్ స్టార్ విజయ్ సినిమాకు కూడా సంగీతం అందించబోతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 66 సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడిగా సెలక్ట్ అయినట్లు తెలుస్తోంది.
దాదాపు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ కూడా తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. హీరో విజయ్ ఇటీవల వంశీపైడిపల్లి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీలైనంత త్వరగా ఆ సినిమానే సెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ బీస్ట్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఆ సినిమా అయిపోయిన తర్వాత విజయ్ తన 66 సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం విజయ్ దాదాపు 90 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.