»   » మహేష్ ‘1’ ఓవర్సీస్ రిలీజ్ డీటేల్స్, ఎన్నో ప్రత్యేకతలు!

మహేష్ ‘1’ ఓవర్సీస్ రిలీజ్ డీటేల్స్, ఎన్నో ప్రత్యేకతలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ తెరకెక్కిస్తున్న '1'(నేనొక్కడినే) చిత్రాన్ని ఓవర్సీస్‌లో FICUS సంస్థ విడుదల చేయనుంది. జనవరి 10 ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కృతి సానన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ చిత్రం ఈ సారి అనేక ప్రత్యేకతలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇదివరకెన్నడూ చూడని బ్రహ్మాండమైన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది వరకు ఏ తెలుగు సినిమాలో లేని విధంగా ఈ చిత్రాన్ని 2 నెలల పాటు యూకెలో చిత్రీకరణ జరిపారు.

మహేష్ బాబు చిత్రానికి ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తుండటం ఇదే తొలిసారి. దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే పలువురు స్టార్ హీరోల చిత్రాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. రోబో సినిమాకు పని చేసిన ప్రఖ్యాత కెమెరామెన్ రత్నవేలు ఈ చిత్రానికి పని చేస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా చెప్పుకోవచ్చు.

డిసెంబర్ 14న ఆడియో పంక్షన్ డేట్ ఫిక్స్ చేసారని సమాచారం. దాదాపు అన్ని తెలుగు ఛానెల్స్ లో ఒకేసారి ఈ చిత్రం ఆడియో టెలీకాస్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పెద్ద సిటీలు,టౌన్స్ లో పెద్ద స్క్రీన్స్ పై ఈ ఆడియోని లైవ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చెస్తున్నట్లు వినికిడి.

English summary
Mahesh Babu-Sukumar combination movie 1-Nenokkadine overseas by 14 Reels thru FICUS. 1-Nenokkadine is going to be a visually spectacular STYILSH ACTION THRILLER with 1 of its kind, never before seen action sequences in Telugu film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu