»   »  మహేష్, రామ్ చరణ్ టార్గెట్: పండగ ముసుగులో...!

మహేష్, రామ్ చరణ్ టార్గెట్: పండగ ముసుగులో...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంక్రాంతి పండగ సందర్భంగా సాధారణ ప్రజలతో పాటు అధికారులు, పోలీసులు సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో......సినిమా పైరసీ మాఫియా రెచ్చిపోయింది. ఈ సమయంలో పైరసీపై అంతగా నిఘా ఉండదనే భావనతో కొత్తగా రిలీజైన మహేష్ బాబు '1 నేనొక్కడినే', రామ్ చరణ్ 'ఎవడు' చిత్రాల పైరసీ సీడీలు భారీ ఎత్తున మార్కెట్‌లోకి దించేసారు.

అయితే ఈ పైరసీ వ్యవహారంపై ఓ కన్నేసి ఉంచిన అధికారులు, పోలీసులు.....దాడులు నిర్వహించి పలు చోట్ల పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కృష్ణా జిల్లాలో పైరసీ దారుల ఆటకట్టించిన పోలీసులు, తాజాగా ఖమ్మంజిల్లా పాల్వంచలో రెండు షాపులపై దాడులు నిర్వహించి పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు.

ఎవడు సినిమా విషయానికొస్తే....జనవరి 12న విడుదలైన ఈచిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెలుతోంది. 'ఎవడు' చిత్రం ఆంధ్రప్రదేశ్‌లో తొలి రోజు రూ. 9.03 కోట్ల నెట్ సాధించినట్లు తెలుస్తోంది. ఎవడు చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. రామ్ చరణ్, అమీ జాక్సన్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు. అల్లు అర్జున్, కాజల్ ఈచిత్రంలో అతిథి పాత్రల్లో నటించారు.

 1 Nenokkadine and Yevadu Piracy CDs

ఇటీవల ఏర్పాటు చేసిన 'ఎవడు' మూవీ సక్సెస్ మీట్లో దిల్ రాజు మాట్లాడుతూ....'ఎవడు సినిమా ఎన్నోసార్లు వాయిదా పడింది. విడుదల లేటవుతుందని కొన్ని సార్లు నిరాశ పడ్డాను. కానీ విడుదలైన తర్వాత బాక్సాఫీసు వద్ద ఫలితాలను మమ్మలి ఎంతో ఆనంద పరుస్తున్నాయి. మా బేనర్లో ఇప్పటి వరకు తీసిన 16 సినిమాల కంటే ఈచిత్రం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది' అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

'1 నేనొక్కడినే' సినిమా విషయానికొస్తే....మహేష్ బాబు నటించిన ఈచిత్రం జనవరి 10న విడుదలైంది. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈచిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ......మహేష్ బాబు నుండి ఫ్యామిలీ డ్రామా, మాస్ మసాలా, కామెడీ ఎలిమెంట్లు ఆశించిన ప్రేక్షకులు నిరాశ పడ్డారు.

English summary

 Telugu movie makers are very much worried about one name that is Piracy, a couple of days before we reported that recently released flicks Yevadu and 1 Nenokadine were pirated in Krishna District and were sold now similar incident took place in Khammam district.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu