»   »  100 డేస్ ఆఫ్ లవ్... సాక్షిగా: నాని, నితిన్, నిత్య మల్టీస్టారర్ (ఫోటోస్)

100 డేస్ ఆఫ్ లవ్... సాక్షిగా: నాని, నితిన్, నిత్య మల్టీస్టారర్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాని, నితిన్, నిత్యా మీనన్ ఈ ముగ్గురు పేర్లు వినగానే 'అలా మొదలైంది', 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే' లాంటిచిత్రాలు గుర్తుకొస్తాయి. ఈ ఇద్దరు హీరోలతో రెండే సినిమాలు చేసిన నిత్యా మీనన్ వారికి చాలా క్లోజ్ ఫ్రెండ్.

నిత్యా మీనన్ మళయాలంలో నటించిన చిత్రం తెలుగులో 100 డేస్ ఆఫ్ ల‌వ్‌ పేరుతో రిలీజవుతోంది. దుల్క్ సల్మాన్ హీరో. జీన‌స్ మొహ్మ‌ద్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ సినిమా తెలుగు ఆడియో రిలీజ్ వేడుక బుధవారం సాయంత్రం నాని, నితిన్ చేతుల మీదుగా రిలీజ్ చేసారు.

ఎస్ ఎస్ సీ మూవీస్ స‌మ‌ర్ఫ‌ణ‌లో ఎస్‌. వెంక‌ట్ ర‌త్నం తెలుగులో ఈ సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నారు. అభిషేక్ పిక్చ‌ర్స్ సంస్థ రెండు రాష్ట్రాల్లోనూ విడుద‌ల చేస్తోంది. ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా పాట‌లు విడుద‌లయ్యాయి.

ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ నిత్యామీన‌న్‌తో క‌లిసి ఇప్ప‌టికి రెండు సినిమాలు చేశాను. నాని కూడా రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు నిత్యామీన‌న్ పెద్ద స్టార్ రేంజ్‌కి ఎదిగింది. మేం ముగ్గురం క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయాల‌ని ఉంది. అది కూడా వెంక‌ట్‌కే చేయాల‌ని ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ నుంచి డిస్ట్రిబ్యూట‌ర్‌గా, ఇప్పుడు ఈ సినిమా నిర్మాత స్థాయికి ఎదిగాడు వెంక‌ట్‌. త‌న‌కి ఈ సినిమా పెద్ద హిట్ కావాలి అని అన్నారు.

నితిన్ ప్రతిపాదించిన మల్టీ స్టారర్ మీద నాని ఎలా స్పందించాడు? అనేది వివరాలు స్లైడ్ షోలో

సినిమా నాని మాట్లాడుతూ

సినిమా నాని మాట్లాడుతూ


నిత్యా గురించి ఎవ‌రు ఎక్క‌డ మాట్లాడినా నాకు గ‌ర్వంగా ఉంటుంది. త‌ను మా `అలా మొద‌లైంది` సినిమాతో తెలుగులో కెరీర్‌ని మొద‌లుపెట్టింది. ఈ సినిమా మ‌ల‌యాళ ట్రైల‌ర్ విడుద‌లైన‌ప్పుడు చూశాను. చాలా క్యూట్‌గా అనిపించింది. స‌బ్ టైటిల్స్ తో చూద్దామ‌ని అనుకున్నా. ఇప్పుడు తెలుగులో హాయిగా చూడొచ్చు. సినిమా సంగీతం బావుంది' అన్నారు.

మల్టీ స్టారర్ గురించి..

మల్టీ స్టారర్ గురించి..


నిత్యా, నేను, నితిన్ క‌లిసి ఓ సినిమా చేస్తే నిజంగానే చాలా బావుంటుంది అని నాని అభిప్రాయ పడ్డారు.

నిత్యామీన‌న్ మాట్లాడుతూ

నిత్యామీన‌న్ మాట్లాడుతూ


ఈ సినిమాను ఫ్రెండ్లీగా చేశాను. ఈ సినిమా టీమ్ అంతా నాకు మంచి ఫ్రెండ్స్. తెలుగు ఆడియ‌న్స్ కి ఈ చిత్రం చాలా కొత్త‌గా ఉంటుంది. క‌ల‌ర్స్, సెట్స్, షాట్స్, మ్యూజిక్ ఇలా ప్ర‌తిదీ చాలా వైవిధ్యంగా ఆలోచించి చేశామన్నారు.

హాలీవుడ్ స్థాయిలో

హాలీవుడ్ స్థాయిలో


హాలీవుడ్ స్థాయిలో ‘100 డేస్ ఆఫ్ ల‌వ్' సినిమా ఉంటుందని, త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉందని నిత్యా మీనన్ తెలిపారు.

ఆ పాట సూపర్

ఆ పాట సూపర్


ఇందులో హృద‌యం అనే పాట నాకు చాలా ఇష్టం. పాట‌లు మ‌ల‌యాళంలో క‌న్నా తెలుగులో ఇంకా బాగా ఉన్నాయని నిత్యా మీనన్ తెలిపారు.

English summary
Check out 100 Days of Love Telugu Movie Audio Launch photos. Starring Dulquer Salmaan, Nithya Menen, Sekhar Menon, Aju Varghese, Vineeth and Praveena. Music by Govind Menon. Directed by Jenuse Mohamed. Produced by KV Vijayakumar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu