»   » నిత్యా మీనన్ ‘100 డేస్ ఆఫ్ ల‌వ్’ రిలీజ్ డేట్ ఖరారు

నిత్యా మీనన్ ‘100 డేస్ ఆఫ్ ల‌వ్’ రిలీజ్ డేట్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎవ‌ర్ గ్రీన్ పెయిర్ దుల్క‌ర్ స‌ల్మాన్, నిత్య‌మీన‌న్ జంట‌గా రానున్న 100డేస్ ఆఫ్ ల‌వ్ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే ఆడియో విడుద‌ల చేసుకున్న ఈ సినిమాను ఆగ‌స్టు 26న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి మేక‌ర్స్ నిర్ణ‌యించారు.

జీన‌స్ ముహ్మ‌ద్ ద‌ర్శ‌క‌త్వంలో, SSC మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో , ఎస్. వెంక‌ట‌ర‌త్నం నిర్మాత‌లు వ్య‌వ‌హరిస్తున్న ఈ చిత్రం మ‌ల‌యాళం లో ఎంతటి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే.తెలుగులోనూ అంతటి ఘ‌న విజ‌యాన్ని సాధిస్తామ‌న్న ధీమా వ్య‌క్తం చేస్తున్నారు చిత్ర యూనిట్. ఆల్రెడీ రిలీజ్ డేట్ ను క‌న్ఫార్మ్ చేసుకున్న ఈ సినిమాతో నిత్య మీన‌న్ త‌న మేనేజ‌ర్ అయిన వెంక‌ట్ ను ప్రొడ్యూస‌ర్ గా ప‌రిచ‌యం చేస్తున్న ఈ సినిమాపై నిత్య బాగానే కేర్ తీసుకుంటుంది. ఇప్ప‌టికే మంచి ఊపు మీదున్న ప్ర‌మోష‌న్స్ లో, మ‌రో రెండు రోజుల్లో నిత్య మీన‌న్, దుల్క‌ర్ సల్మాన్ లు కూడా పాల్గొన‌నున్నారు.

100 Days of Love releasing on 26th Aug

ఓకే బంగారం సినిమాతో యూత్ ని క‌ట్టిప‌డేసిన ఈ జంట‌, ఈ సినిమాతో అంద‌రికీ మరింత చేరువ కానున్నారు. ప్రేమ‌క‌థా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై అంద‌రికీ మంచి అంచనాలే ఉన్నాయి.

English summary
100 Days of Love releasing on 26th August. Starring Dulquer Salmaan and Nithya Menon Movie Produced by S.venkataratnam Film Directed by Jenuse Mohamed with Music by Govind Menon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu