twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    100 రోజులుగా బోసిపోయిన సినీ ఆలయాలు.. ప్రేక్షక దేవుళ్లకు కరువైన వినోద నైవేద్యం

    |

    మునుపెన్నడూ లేని విధంగా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ప్రపంచ సినిమా పరిశ్రమ ఓ విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్నది. వందేళ్లకుపైగా సినిమా చరిత్రలో 100 రోజులుపాటు సినీ థియేటర్లు మూతపడిన దాఖలాలు లేవు. కరోనావైరస్ కారణంగా సినీ పరిశ్రమ, కార్మికులు, నటులు, నిర్మాతలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కరోనా పరిస్థితులు చక్కబడితే మళ్లీ సినిమా పరిశ్రమను పూర్వ వైభవం వైపు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. గత 100 రోజుల్లో సినీ పరిశ్రమలో చోటుచేసుకొన్న పరిణామాలు ఏమిటంటే..

    ప్రాణాంతక వ్యాధి ముప్పుతో

    ప్రాణాంతక వ్యాధి ముప్పుతో

    తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రాణాంతక వ్యాధిని నివారించేందుకు లాక్‌డౌన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే మార్చి 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లలో సినిమా ప్రదర్శనలు నిలిపివేశారు. దాంతో సినీ ప్రేక్షకుల వినోదానికి బ్రేక్ పడింది. రెండు వారాల గడువుతో మొదలైన లాక్‌డౌన్ ఇప్పటికి 100 రోజులకు చేరుకొన్నది.

    షూటింగులు, ప్రదర్శనలు నిలిపివేత

    షూటింగులు, ప్రదర్శనలు నిలిపివేత

    కరోనా వైరస్ పరిస్థితులు తీవ్రతరం కావడంతో సినిమా షూటింగులు నిలిపివేశారు. టెలివిజన్ సిరియల్స్, షోల షూటింగ్స్ అంతరాయం ఏర్పడింది. రోజువారి వేతన కార్మికుల జీవితం సందిగ్గంలో పడింది. పలు సినిమాల రిలీజ్‌లు ఆగిపోయాయి. దాంతో ఏ సినీ పరిశ్రమ కూడా ఇప్పటి వరకు చూడని దారుణమైన పరిస్థితి చూడాల్సి వచ్చింది.

    వేతన కార్మికులకు ఇబ్బందులు

    వేతన కార్మికులకు ఇబ్బందులు

    దేశవ్యాప్తంగా పలు భాషల సినిమా పరిశ్రమల్లో సహాయక చర్యలు ఊపందుకొన్నాయి. బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, తదితర నటులు ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు. ఇక టాలీవుడ్‌లో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటైంది. దాంతో ఇండస్ట్రీలోని వేతన కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణి, సహాయ కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి.

    ఓటీటీ రంగం తెరపైకి

    ఓటీటీ రంగం తెరపైకి

    సినిమా థియేటర్లు మూత పడటంతో వాటి స్థానంలోకి అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5, ఆహా లాంటి ఓటీటీ ఫ్లాట్‌ఫాంతోపాటు మరికొన్ని కొత్తగా పుట్టుకొచ్చాయి. రిలీజ్‌కు సిద్దమై ఆగిన సినిమాలన్నీ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. అమితాబ్ నటించిన గులాబో సితాబో, జ్యోతిక నటించిన పోనుమాదల్ వాంధల్, కీర్తీ సురేష్ నటించిన పెంగ్విన్, ఇటీవల కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇంకా కొన్ని రిలీజ్‌కు క్యూ కట్టాయి.

    ప్రభుత్వాలతో సినీ పెద్దల చర్చలు

    ప్రభుత్వాలతో సినీ పెద్దల చర్చలు

    లాక్‌డౌన్ సడలింపుల తర్వాతసినీ అగ్రతారలు, నిర్మాతలు కలిసి ప్రభుత్వాలతో చర్చలు జరిపారు. షూటింగులతోపాటు సినిమాల ప్రదర్శనకు థియేటర్లను ఓపెన్ చేయాలని సర్కార్లకు విన్నపాలు చేశారు. ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించి షూటింగులకు అనుమతులు ఇచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో షూటింగుల కదలిక మొదలైంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా కరోనా కేసులు పెరిగిపోవడంతో షూటింగులకు యూనిట్లు ముఖం చాటేస్తున్నాయి.

    Recommended Video

    Nepotism పై Renu Desai హాట్ కామెంట్స్‌!
    ఇప్పుడిప్పుడే థియేటర్ల ఓపెన్.. కానీ

    ఇప్పుడిప్పుడే థియేటర్ల ఓపెన్.. కానీ

    ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పుడిప్పుడే సినిమా థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. న్యూజిలాండ్, దుబాయ్ లాంటి దేశాల్లో పరిస్థితులకు అనుగుణంగా థియేటర్లలో ప్రదర్శనలు ప్రారంభమైనప్పటికీ అంత సానుకూలంగా లేదు. పలు దేశాల్లో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో రిలీజ్ చేయాలనుకొన్న టెనెట్ లాంటి చిత్రాల విడుదలను వాయిదా వేయడం గమనార్హం.

    English summary
    Deadly virus Corona has been given huge impact on film industry worldwide. It has been lockdowned movie theatres since 100 days in Indian film Industry. Due to Coronavirus situations, Still ambiguity going on.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X