twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి’ కోసం 100 అడుగుల భారీ విగ్రహం!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: భారీ బడ్జెట్, భారీ తారాగణం, భారీ సెట్టింగులు ఇలా...అన్నింటిలోనూ భారీ తనం ప్రదర్శిస్తున్న ‘బాహుబలి' చిత్రంలో మరో భారీ ప్రత్యేక కూడా ఉంది. ఈ చిత్రం షూటింగ్ కోసం 100 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సినిమాలో ఈ విగ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. అందు వల్లే ఎంతో శ్రమించి ఈ విగ్రహాన్ని షూటింగు కోసం రెడీ చేసారు.

    ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో 100 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే తలిసారి. ఈ విగ్రహం బరువు పదుల టన్నుల్లో ఉంటుందని అంచనా. ప్రస్తుతం బాహుబలి చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రభాస్, అనుష్క, ఇతర ముఖ్య తారాగణంపై పాత్రల చిత్రీకరణ జరుగుతోంది. బాహుబలి ఫస్ట్ పార్ట్ 2015లో ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    100 Feet statue for Baahubali shoot!

    ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇంకా రమ్యకృష్ణ, సత్యరాజ్, నాసర్, అడవి శేష్, సందీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రానా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీతో విదేశీ బాషల్లో కూడా విడుదల చేస్తారట.

    ఆర్కా మీడియావర్క్ తెరకెక్కిస్తున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. కళ్లు చెదిరే గ్రాఫిక్స్, పోరాట సన్నివేశాలతో ఈచిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగిస్తుంది.

    English summary
    ‘Baahubali’ will have one more unique and massive addition in the form of a giant 100 foot statue. This statue will play a crucial role in the movie and it is one of the largest statues ever installed for a movie set.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X