twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భజనగాళ్లకేనా? వందేళ్ల సినీ వేడుక, కవిత కంటతడి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని సౌతిండియా ఫిల్మ్ చాంబర్ ఆధ్వర్యంలో చెన్నైలో నాలుగు రోజుల పాటు వేడుక నిర్వహిస్తున్న సంగతి తెలిసింది. సౌతిండియాలోని తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం చిత్ర పరిశ్రమలకు చెందిన వారంతా ఈ వేడుకలో పాల్గొంటున్నారు.

    అయితే ఈ సినిమా వేడుకలో తీవ్రమైన వివక్ష కొనసాగుతోందని, భజన పరులకు...కాకా పట్టేవాళ్లకే ఈ వేడుకకు ఆహ్వానాలు అందాయని, నాతో పాటు చాలా మంది సీనియర్లకు అసలు ఆహ్వానం అందలేదని నటి కవిత ఆవేదన వ్యక్తం చేసారు. నిర్వాహకుల తీరు తనను ఎంతో బాధ పెట్టిందడంటూ ఆమె మీడియా ముందు కంటతడి పెట్టారు.

     Kavitha

    తాను పరిశ్రమలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చానని, కెరీర్లో ఎంతో మంది సూపర్ స్టార్లతో చేసానని, ఇప్పటికీ నటిస్తూ....రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా ఉంటున్నానని, నా లాంటి వారికి ఈ పరిశ్రమ ఇచ్చిన గౌరవం ఇదీ...అంటూ ఆమె కన్నీముమున్నీరయ్యారు.

    నేను జూనియర్ ఆర్టిస్టునేమీ కాదు....నాకంటే వెనక వచ్చి చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లకు కూడా ఆహ్వానాలు పంపారు. నాకు మాత్రం పంపలేదు. దీన్ని తాను దురదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితి వేరు. పైనున్న వాళ్లకు భజన చేసే వాళ్లకు, పైరవీలు చేసే వాళ్లకే ప్రాధాన్యత అంటూ ఆమె మండి పడ్డారు.

    మరో వైపు వందేళ్ల భారతీయ సినిమా పండుగలో తెలుగు దర్శకుడు ఆర్. నారాయణమూర్తికి తీవ్ర అవమానం జరిగింది. ఆయన వేదికపైకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయగా ఆయనదగ్గర నుంచి సౌతిండియా ఫిల్మ్ చాంబర్ చైర్మన్ సి. కళ్యాణ్ ఆదేశాల మేరుకు కొందరు మైకు లాక్కున్నారు. వేధిక పై నుంచి ఆయన్ను బయటకు నెట్టేసారు.

    సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ....వందేళ్ల సినిమా పండగలో తెలుగు వారిపై తీవ్ర వివక్ష కొనసాగుతోందని, దాసరి నారాయణరావు లాంటి పెద్దలను ఈ వేడుకకు ఆహ్వానించక పోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కె విశ్వనాథ్ లాంటి పెద్దలను కూడా వేదికపైకి ఆహ్వానించక పోవడం తెలుగు వారికి అవమానం కాకుంటే మరేమిటని ఆగ్రహం వ్యక్తం చేసారు. వందేళ్ల సినిమా ఫంక్షన్ ఆడియో వేడుకలా జరుగుతోందని విమర్శించారు.

    English summary
    Movie artist turned politician Kavitha is severely upset with the ongoing 100 years of Indian cinema celebrations in Chennai. The actress expressed her anguish over event managers for missing invitation to her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X