»   » ఏమిటీ... చిరంజీవి తల్లిదండ్రులు వీళ్లా?

ఏమిటీ... చిరంజీవి తల్లిదండ్రులు వీళ్లా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న 150వ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. మంచి మూహూర్తం పేరుతో సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికాక ముందే అప్పట్లో ప్రారంభోత్సం జరిపారు. ఆలస్యం అవుతుందనే కారణంతో హీరోయిన్ ఇతర పాత్రల ఎంపిక పూర్తికాక ముందే షూటింగ్ కూడా ప్రారంభించేసారు.

షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత క్రమ క్రమంగా హీరోయిన్, విలన్, ఇతర ముఖ్య పాత్ర దారుల ఎంపిక జరుగుతోంది. ఇటీవలే ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ ఎంపికైన సంగతి తెలిసిందే. తాజాగా ఇందులో చిరంజీవి తల్లిదండ్రుల పాత్రల ఎంపిక కూడా జరిగింది.

ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు టాక్. అందులో చిరంజీవి యువకుడిగా కనిపిస్తారని, ఈ పాత్రకు తల్లిదండ్రుల ఎంపిక జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. చిరంజీవి తల్లి పాత్రలో అన్నపూర్ణను, తండ్రి పాత్రలో చలపతిరావును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

వారంలో చిరంజీవి, అన్నపూర్ణమ్మ, చలపతిరావు పాత్రలపై షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో అమ్మ పాత్రల ఎంపిక విషయంలో కొత్త ట్రెండు నడుస్తోంది. కాస్త గ్లామరస్‌గా కనిపించే వారినే అమ్మ పాత్రలకు ఎంపిక చేస్తున్నారు. అయితే ఇది కాస్త యంగ్ హీరోలకు సెట్టువుందని.. కానీ చిరంజీవి లాంటి ఏజ్డ్ హీరోలకు వర్కౌట్ కాదు కాబట్టి అన్నపూర్ణమ్మను ఎంపిక చేసినట్లు స్పష్టం అవుతోంది.

అంచనాలు భారీగా...

అంచనాలు భారీగా...

ఒకప్పుడు తెలుగులో నెం.1 హీరోగా వెలుగొందిన చిరంజీవి దాదాపు 9 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమా చేస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

అన్నపూర్ణమ్మ

అన్నపూర్ణమ్మ

అన్నపూర్ణమ్మ గతంలోనూ చిరంజీవితో కలిసి నటించింది.

చలపతిరావు..

చలపతిరావు..

అయితే చలపతిరావు చిరంజీవి తండ్రి పాత్రలో సూటవుతాడా? లేదా? అనేది డౌట్. అయితే మేకప్ ద్వారా సెట్టయ్యేట్టు చేస్తారని అంటున్నారు.

రామ్ చరణ్ నిర్మాత

రామ్ చరణ్ నిర్మాత

ఈ చిత్రానికి స్వయంగా రామ్ చరణే నిర్మాత కావడంతో సినిమాపై అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.

వివి వినాయక్

వివి వినాయక్

మెగా స్టార్ చిరంజీవి 150 సినిమాకు దర్శకత్వం అంటే మాటలు కాదు... అందుకే వివి వినాయక్ ఈ సినిమాకు తన జీవితంలో ఎప్పుడూ కష్టపడనంతగా కష్టపడుతున్నారు.

English summary
Makers of megastar Chiranjeevi’s 150th film have roped in old mother. Veteran actress Annapurna, who was the synonym of ‘mother’ characters in the past, has been roped in.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu