»   » 2.0 మూవీకి పాకిస్థాన్లో ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు!

2.0 మూవీకి పాకిస్థాన్లో ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  #2point0 : Demand For Rajinikanth Starrer Triples In Pak | Filmibeat Telugu

  రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన 2.0 చిత్రం నిన్న గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ 10,500 స్క్రీన్లలో విడుదలైన ఈ విజువల్ వండర్ హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

  ముఖ్యంగా సౌత్ ఇండియాలో సినిమా అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. హిందీ వెర్షన్‌కు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. అయితే కేవలం ఇండియాలోనే కాదు, దాయాది దేశం పాకిస్థాన్లో కూడా ఈ సినిమాకు డిమాండ్ అదిరిపోతోంది.

  పాకిస్థాన్లో అదనంగా మూడు రెట్ల స్క్రీన్స్ పెంపు

  పాకిస్థాన్లో అదనంగా మూడు రెట్ల స్క్రీన్స్ పెంపు

  పాకిస్థాన్లో 2.0 చిత్రాన్ని 15 నుంచి 20 థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే అడ్వాన్స్ బుకింగ్ లోనే టికెట్స్ అన్నీ అమ్ముడయ్యాయి. సినిమాకు డిమాండ్ భారీగా ఉండటంతో పాకిస్థాన్ వ్యాప్తంగా ఈ స్క్రీన్ల సంఖ్యను 75కు పెంచారు.

   పాకిస్థాన్‌లో రజనీకాంత్ ఫ్యాన్స్

  పాకిస్థాన్‌లో రజనీకాంత్ ఫ్యాన్స్

  పాకిస్థాన్‌లో రజనీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2016లో కబాలి సినిమా విడుదలైనప్పటి నుంచి సూపర్ స్టార్ ఫాలయింగ్ మరింత పెరిగింది. పాకిస్థాన్లో కాబాలి అప్పట్లో మంచి వసూళ్లు సాధించింది.

  2.0 ఫీవర్

  2.0 ఫీవర్

  ఇండియా, పాకిస్థాన్‌తో పాటు యూఎఈ, న్యూజియాలాండ్ లాంటి చోట్ల సినిమాకు డిమాండ్ బాగా ఉండటంతో అదనపు స్క్రీన్లు జత చేశారు. ఫస్ట్ వీకెండ్ భారీ వసూళ్లు నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

   బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందా?

  బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందా?

  రూ. 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘బాహుబలి 2' ఫుల్ రన్‌లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 1810 కోట్లు రాబట్టింది. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 2.0 చిత్రం బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందా? లేదా? అనే ఆసక్తి అందిరిలోనూ నెలకొంది.

  English summary
  Superstar Rajinikanth is a phenomenon all across India and especially in the South, people go to extreme lengths just to watch his movies on the silver screen and when it comes down to watch it on the first day first show, fans can litrelly do anything. His latest release 2.0 is shattering all the records at the box office and has received positive reveiws as well. Also, our neighbouring country Pakistan has caught the Rajini wave and due to popular demand, the number of screens for 2.0 has been tripled and the theatres are cashing in on the Rajini fever.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more