»   » మహేష్ బాబు, బన్నీసినిమాలకు లైన్ క్లియర్...... రజనీకాంత్ ‘2.0’ రిలీజ్ ఇప్పట్లో లేనట్లే!

మహేష్ బాబు, బన్నీసినిమాలకు లైన్ క్లియర్...... రజనీకాంత్ ‘2.0’ రిలీజ్ ఇప్పట్లో లేనట్లే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న '2.0' మూవీ వాయిదాల మీద వాయిదాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీలు తరచూ మార్చడం మూలంగా ఇప్పటికే విడుదల డేట్లు ఖరారు చేసుకున్న ఇతర సినిమాలు ఇబ్బందులు పడుతున్నాయి. తాజాగా ఈ రూ. 450 కోట్ల భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడింది.

ఇప్పటికే మూడు సార్లు

ఇప్పటికే మూడు సార్లు

ఈ చిత్రాన్ని మొదట 2017 దీపావళికి విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాక పోవడంతో 2018 సంక్రాంతికి తర్వాత విడుదల ప్లాన్ చేశారు. అప్పటికీ కూడా పోస్టు ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి రాక పోవడంతో వచ్చే ఏప్రిల్ ఎండింగులో వేసవి సెలవుల సందర్భంగా విడుదల చేద్దామనుకున్నారు. అయితే ఇప్పుడు కూడా ఈ చిత్రం విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

కొన్ని నెలల పాటు సినిమా వాయిదా

కొన్ని నెలల పాటు సినిమా వాయిదా

ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కావడం లేదని ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్స్ సురేందర్ ఎంకె, రమేష్ బాలా తెలిపారు. సినిమాకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేదని, మరికొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే అని తెలిపారు.

ఎప్పుడు విడుదలవ్వొచ్చు?

ఎప్పుడు విడుదలవ్వొచ్చు?


ప్రస్తుతం ‘2.0' చిత్రానికి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ అమెరికాలో జరుగుతోంది. జులై నెలలో ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో సినిమా ఆగస్టులో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.

మహేష్ బాబు, బన్నీ సినిమాలకు లైన్ క్లియర్

మహేష్ బాబు, బన్నీ సినిమాలకు లైన్ క్లియర్

‘2.0' మూవీని ఏప్రిల్ నెలలో విడుదల చేస్తున్నామని నిర్మాతలు ఆ మధ్య ప్రకటించడంతో అదే నెలలో విడుదలకు సిద్ధమైన మహేష్ బాబు ‘భరత్ అనే నేను', అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య' చిత్రాలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఆ సమయంలో నిర్మాత బన్నీ వాసు ప్రెస్ మీట్ పెట్టి మరీ తన అసంతృప్తిని వెల్లగక్కిన సంగతి తెలిసిందే.

ఆల్ హ్యాపీస్

ఆల్ హ్యాపీస్

‘2.0' మూవీ విడుదల ఆగస్టుకు వాయిదా పడటంతో..... ‘భరత్ అనే నేను', ‘నా పేరు సూర్య' చిత్ర నిర్మాతల్లో ఆనందం నెలకొంది. ఇక వచ్చే వేసవిలో టాలీవుడ్లో ఈ రెండు చిత్రాల మధ్య ప్రధానమై పోటీ ఉండనుంది.

సదరు కంపెనీపై నిర్మాతలు కేసు

సదరు కంపెనీపై నిర్మాతలు కేసు


రోబో ‘2.0' సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ అమెరికాలోని ప్రముఖ విఎఫ్ఎక్స్ కంపెనీలో జరుగుతోంది. అయితే అనుకున్న సమయానికి వారు పని పూర్తి చేయలేదు. తాము ఓ వైపు సినిమా రిలీజ్ పెట్టుకుంటే వారు ఇలా నిర్లక్ష్యం చేయడంతో..... సదరు కంపెనీపై నిర్మాతలు కేసు వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

భారీ తారాగణం

భారీ తారాగణం

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్‌ హుసేన్‌, కళాభవన్‌ షాజాన్‌, రియాజ్‌ ఖాన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్

ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్

2.0 సినిమా ఇండియాలోనే ఇప్పటి వరకు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం. 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

English summary
The film, that was supposed to release on Diwali 2017, was pushed to January 2018 release owing to pending VFX work. But the makers failed to meet the deadline, and 2.0 was further postponed to April. And the latest buzz suggests that 2.0 won't release in April too. Trade Analyst Surendhar MK told BollywoodLife that the film has been pushed further by a few months.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu