»   » 2.0 టీజర్: రజనీకాంత్ అభిమానులకు పండగే

2.0 టీజర్: రజనీకాంత్ అభిమానులకు పండగే

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాహుబలి ప్రాజెక్టును మించిపోయేలా ఇండియాలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన '2.0'. ఈ సినిమా కోసం ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. గతేడాది రావాల్సిన ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు నవంబర్ 29, 2018న విడుదలకు రంగం సిద్ధమైంది.

  రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈచిత్రాన్ని ఏ స్థాయిలో తెరకెక్కించారో ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, మేకింగ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ వీడియోల ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. త్వరలో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ టీజర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న టీజర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

  2.0 teaser releasing on Independence Day

  అక్షయ్ కుమార్ నటించిన హిందీ చిత్రం 'గోల్డ్' సినిమాతో పాటు 2.0 మూవీ టీజర్ దేశ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నారు. దీంతో పాటు కమల్ హాసన్ విశ్వరూపం 2 మూవీతో కూడా 2.0 టీజర్ అటాచ్ చేస్తారని టాక్.

  కాగా... టీజర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 3డిలో చిత్రీకరించిన తొలి ఇండియన్ మూవీ కూడా ఇదే కావడం విశేషం. 2010లో వచ్చిన రోబో సినిమాకు ఇది సీక్వెల్‌గా ఉండబోతోంది.

  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా పాత్ర పోసించడం సినిమాకు హైలెట్ కానుంది. రజనీకాంత్, అమీ జాక్సన్ రోబోలుగా కనిపించబోతున్నారు.

  ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్‌ హుసేన్‌, కళాభవన్‌ షాజాన్‌, రియాజ్‌ ఖాన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఇండియన్ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో వేలాది థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

  English summary
  The first teaser from Rajinikanth and Akshay Kumar's upcoming movie 2.0 unveil as an Independence Day treat. If reports are to be believed, the teaser will be launched on the midnight of August 15 and will be played in theatres in which Akshay Kumar's Hindi film Gold will be screened across India.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more