»   » నెం. 1 రికార్డ్ మాదే: ‘ఖైదీ నెం 150’ టీం ప్రకటన

నెం. 1 రికార్డ్ మాదే: ‘ఖైదీ నెం 150’ టీం ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం 'ఖైదీ నెం 150' పై అంచనాలు భారీగా ఉన్నాయి. దాదాపు 9 సంవత్సరాల విరామం తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆదివారం సాయంత్రం ఈ చిత్రానికి సంబంధించిన 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' అనే ఆడియో ట్రాక్ యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేయగా.... సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 24 గంటల్లో 20 లక్షల(2 మిలియన్) వ్యూస్‌ సాధించింది.

Ammadu Lets DoKummudu song

ఈ పాటను కేవలం 24 గంటల్లోనే 20 లక్షల మంది చూశారని, టాలీవుడ్ చరిత్రలో ఇది నెం. 1 రికార్డ్ అని, అత్యంత వేగంగా 2 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకున్న ఆడియో సాంగ్‌ ఇదేనని చిత్ర బృందం ట్వీట్‌ చేసింది.

ఇక ఈ పాటను కంపోజ్ చేసిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.....ఈ సాంగును ఇంత పెద్దహిట్ చేసినందుకు థాంక్స్ చెబుతూ ట్వీట్ చేసారు. ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్‌, రాణినారెడ్డి కలిసి పాడిన సంగతి తెలిసిందే.

ఆడియో వేడుక జరుగుతుందని అభిమానులంతా భావించారు కానీ.... ఎలాంటి వేడుక లేకుండానే ఆడియోను నేరుగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే జనవరి 4న ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 11, 2017న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
2 Million+ views for Ammadu Lets DoKummudu song in 24hrs. AMMADU Lets Do KUMMUDU, the first song from Khaidi No 150. Lahari Music Presents the "AMMADU Lets Do KUMMUDU" Full Song With Lyrics of Mega Star Chiranjeevi's grand comeback movie "Khaidi No 150" by Konidela Production Company & LYCA Productions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu