twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కళ్లు చెదిరేలా 2.O.. మళ్లీ మళ్లీ చూసిన రజనీ.. 2150 వీఎఫ్ఎక్స్‌ షాట్స్‌‌తో క్రేజీగా!

    |

    రోబో 2.O మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది ప్రేక్షకుల్లోనే కాదు.. సినీ ప్రముఖుల్లో ఆసక్తి పెరుగుతున్నది. హాలీవుడ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా మీడియాకు కొన్ని మేకింగ్ వీడియోలు, ట్రైలర్, ఇంకా విడుదల కానీ యంతర లోకపు సుందరివే అనే పాటను ఇటీవల మీడియాకు చూపించారు. వివరాల్లోకి వెళితే..

    సరికొత్త టెక్నాలజీతో 2.O

    సరికొత్త టెక్నాలజీతో 2.O

    ప్రపంచంలోనే తొలిసారి సరికొత్త టెక్నాలజీతో దర్శకుడు శంకర్ తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని నేటివ్ త్రీడీ వెర్షన్‌లో రూపొందించారు. వాస్తవానికి 2డీ ఫార్మాట్‌లోనే తెరకెక్కించి ఆ తర్వాత 3డీ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేస్తారు. కానీ తొలిసారి 2.O చిత్రం కోసం నేరుగా లోకేషన్లలోనే త్రీడీ ఫార్మాట్‌లోనే చిత్రీకరించారు. షూటింగ్ జరుగుతుండగానే లోకేషన్‌లోనే టీవీల్లో త్రీడీ ఎఫెక్ట్‌ను చూసి దర్శకుడు కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది.

     మళ్లీ మళ్లీ చూసిన రజనీకాంత్

    మళ్లీ మళ్లీ చూసిన రజనీకాంత్

    లోకేషన్లలో తాను నటించిన సన్నివేశాలను రజనీకాంత్ చూసి థ్రిల్ అయ్యాడు. కొన్ని సీన్లను మళ్లీ మళ్లీ చూసి ముచ్చటపడ్డారు. ఓ సీన్‌ను రజనీ ఎన్నిసార్లు చూశాడో నాకే తెలియదు. 2.O చిత్రం ప్రపంచ సినీ రంగంలో త్రీడీలో సినిమాలు రూపొందించే వారికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఎక్కువగా త్రీడీ థియేటర్లు అందుబాటులోకి వస్తుంది అని దర్శకుడు శంకర్ పేర్కొన్నారు.

     త్రీడీలో యంతర లోకపు సుందరి

    త్రీడీలో యంతర లోకపు సుందరి

    ఆదివారం హైదరాబాద్‌లో సినిమా మేకింగ్‌ వీడియోలు, ట్రైలర్‌, ‘యంతర లోకపు సుందరివే' త్రీడీ వీడియో సాంగును విడుదల చేశారు. ఈ నెల 29న ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. యంతర లోకపు పాటను చూస్తే .. ఇప్పటి వరకు చూసిన త్రీడి సినిమా వేరు.. చూడబోయే 2.O సినిమా మరోస్థాయిలో ఉంటుందనేది స్పష్టమవుతున్నది.

    విజువల్ వండర్‌గా 2.O

    విజువల్ వండర్‌గా 2.O

    మేకింగ్ వీడియోలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ మాట్లాడుతూ ‘‘2.O చిత్రం విజువల్ వండర్ మాత్రమే కాదు. ఓ అద్భుత సందేశంతో రూపొందించిన చిత్రం. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల ఎలా స్పందిస్తారో అనే విషయం కోసం ఎదురుచూస్తున్నా'' అని పేర్కొన్నారు.

    3 వేల మంది వీఎఫ్‌ఎక్స్ టెక్నిషియన్స్

    3 వేల మంది వీఎఫ్‌ఎక్స్ టెక్నిషియన్స్

    దర్శకుడు శంకర్ మాట్లాడుతూ.. ఇదొక యాక్షన్‌ థ్రిల్లర్‌, ఎంటర్‌టైనర్‌. సినిమా కోసం 3 వేల మంది వీఎఫ్‌ఎక్స్‌ టెక్నిషియన్స్ పని చేశారు. రోబోలో 2150 వీఎఫ్ఎక్స్‌ షాట్స్‌ ఉన్నాయి. 3డీ టెక్నాలజీతో.. 4డీ సౌండ్‌తో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రమిది. రెహ్మాన్, రసూల్‌ పూకుట్టి కొత్త సౌండ్‌ టెక్నాలజీని పరిచయం చేస్తున్నారు. నిర్మాత సుభాష్‌కరణ్‌ లేకపోతే సినిమా లేదు. ఇండియాలో రూ. 550 కోట్ల బడ్జెట్‌తో ఎవరూ సినిమా తీయరు అని మేకింగ్ వీడియోలో పేర్కొన్నారు.

    English summary
    '2.0', undoubtedly the most-anticipated Indian movie of the year. This movie is set to release in the theatres on November 29. The film which is a sequel to the 2010 blockbuster will feature Superstar Rajinikanth in the lead role, while Akshay Kumar is playing the lead antagonist. This movie shot in Native 3D technology.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X