For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్రిటన్ ఆర్టిస్టులు, హాలీవుడ్‌ టెక్నీషియన్లు, కళ్ళు చెదిరే సెట్: సైరా నరసింహా రెడ్డి

  |
  సైరా మూవీ షూటింగ్ అప్ డేట్స్ !

  ఖైదీ నంబర్‌ 150' వంటి భారీ బ్లాక్‌బస్టర్‌తో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తన 151వ చిత్రంగా 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.'ధృవ' వంటి హిట్‌ చిత్రాన్ని అందించిన సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

   బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌

  బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌

  ఇందులో బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌, తమిళ హీరో విజరు సేతుపతి, కన్నడ హీరో సుదీప్‌ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది. ఏ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి పలువురు హాలీవుడ్‌ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.

   అల్యూమినియం ఫ్యాక్టరీలో

  అల్యూమినియం ఫ్యాక్టరీలో

  ఈ సినిమా కోసం హైదరాబాద్‌ నగర శివార్లలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ భారీ సెట్‌ వేశారు. 1840 నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ, ఆ నాటి బ్రిటీష్‌ ప్రభుత్వ భవంతులు ఎలా ఉండేవో కళ్లకు కట్టే విధంగా ఈ సెట్‌ తయారైందని చెబుతున్నారు. మూడు నెలల నుంచి నిర్మాణంలో ఉన్న ఈ సెట్‌ వర్క్‌ పూర్తయిందనీ, ప్రారంభంలో ఆ సెట్‌లోనే వర్క్‌ జరుగుతుందనీ సమాచారం.

   ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

  విదేశీనటులు ఈ షూటింగ్‌లో పాల్గొంటారనీ, మొదట్లో ఓ పది రోజుల పాటు షూటింగ్‌ జరుగుతుందనీ అంటున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను పోషిస్తున్న చిరంజీవి ఇప్పటికే ఆ పాత్రకు తగ్గట్టుగా తయారయ్యారు. ఆయన నటజీవితంలోనే ఏ సినిమాకీ ఖర్చు పెట్టనంత భారీ వ్యయంతో ‘సైరా' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌

  ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌

  ఈ చిత్రనిర్మాణాన్ని చాలా సీరియస్ గా తీసుకొని ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేస్తున్నారు దర్శకుడు సురేందర్‌రెడ్డి. నయనతార కథానాయికగా నటించే ఈ సినిమాలో అమితాబ్‌, జగపతిబాబు, సుదీప్‌, విజయ్‌ సేతుపతి కీలక పాత్రలు పోషించనున్నారు. ఏ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.

   బ్రిటిష్ సైనికులుగా

  బ్రిటిష్ సైనికులుగా

  బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం బ్రిటన్ నుంచి దాదాపు 200 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులను రప్పించబోతున్నారట. వాళ్లంతా సినిమాలో బ్రిటిష్ సైనికులుగా నటించబోతున్నారట.

  బ్రిటన్ నుంచి జూనియర్ ఆర్టిస్టులు

  బ్రిటన్ నుంచి జూనియర్ ఆర్టిస్టులు

  సినిమా న్యాచురల్‎గా ఉండేందుకు కాస్త ఖర్చు ఎక్కువైనా బ్రిటన్ నుంచి జూనియర్ ఆర్టిస్టులను తీసుకురాబోతున్నారట దర్శనిర్మాతలు. మరోవైపు తరచూ వాయిదా పడుతున్న 'సైరా' షూటింగ్ డిసెంబర్ 6న అయినా మొదలవుతుందా అనే చర్చ జరుగుతోంది.

   అత్యంత భారీ స్థాయిలో

  అత్యంత భారీ స్థాయిలో

  సినిమా కోసం హీరో చిరంజీవి సిద్ధంగానే ఉన్నా అందులో నటించబోయే ఇతర నటులు, నిర్మాత రామ్‎చరణ్ బిజీగా ఉండటం ఇలాంటి సందేహాలు కలిగేలా చేస్తోంది. అయితే ఆలస్యమైనా ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించాలని నిర్మాత రామ్‎చరణ్ గట్టిగా డిసైడయ్యాడని కొందరు చర్చించుకుంటున్నారు.

  అంచనాలను మించే

  అంచనాలను మించే

  మొత్తానికి 'సైరా' షూటింగ్ మొదలయ్యే తేదీ దగ్గర పడుతుండటంతో సినిమాకు సంబంధించిన మరెన్ని విశేషాలు బయటకు వస్తాయో అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంత ఊహించుకున్నా సినిమా మీ అంచనాలను మించే ఉంటుందన్నమాట.

  English summary
  Sye Raa Narasimha Reddy” started off as a medium budget film but soon escalated into a massive budget film. Being a historical film the producer Ram Charan is leaving no stone unturned and has imported artists for the shoot.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X