»   » 2013: తెలుగు స్టార్ హీరోలు- హిట్లు, ఫ్లాఫ్ లు

2013: తెలుగు స్టార్ హీరోలు- హిట్లు, ఫ్లాఫ్ లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 2013 వెళ్లి ...2014 వచ్చేస్తోంది. ఈ సమయంలో 2013 లో తీపి కబుర్లు అంటే హిట్ కొట్టిన హీరోలు..వారి సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్ కి సంతోషం పంచుతున్నాయి. నిర్మాతలకు మరెన్ని సినిమాలు ప్రారంభించేలా చేస్తున్నాయి. హీరోలు రెట్టించిన ఉత్సాహంతో తర్వాత ప్రాజెక్టులలో బిజీ అవుతున్నారు.

2013లో హిట్, ఫ్లాఫ్ ల మాట అటుంచితే మన స్టార్ హీరోలు ఎంటర్ట్నైమెంట్ పంచడానికి పెద్ద గ్యాప్ తీసుకోలేదు. ఒక్క నందమూరి బాలకృష్ణ మినహాయిస్తే.. మిగతా హీరోలంతా వరస సినిమాల చేస్తూ ప్రేక్షకులకు టచ్‌లోనే ఉన్నారు. 2014లోనూ ఫుల్‌ బిజీనే.

ఈ ఏడాది నాగార్జున కూడా బిజీగానే ఉన్నారు. 'గ్రీకువీరుడు', 'భాయ్‌', 'మనం' చిత్రాలతో ఆయన కాల్షీట్లు నిండిపోయాయి. మరోవైపు కుమారుడు నాగచైతన్య చూపించిన 'తడాఖా' ఆయనకు పుత్రోత్సాహం కలిగించింది. 'మనం'లో తండ్రి, నాగచైతన్యతో కలసి నటిస్తున్నారు. వచ్చే ఏడాదీ ఆయన బిజీనే. డాలీ దర్శకత్వంలో నటించడానికి నాగ్‌ అంగీకరించారు. సుధీర్‌ వర్మ కూడా నాగ్‌ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నారట. ఇదే జోరు కొనసాగితే వచ్చే ఏడాదీ ఆయన డైరీ సినిమాలతో ఫుల్‌ అయిపోతుంది.

హిట్ కొట్టి రికార్డ్ లు సాధించిన సినిమాలు స్లైడ్ షో లో..

అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది

2013లో పరిశ్రమకు దక్కిన అతి పెద్ద విజయం 'అత్తారింటికి దారేది'. ఈ సినిమా ప్రతికూల పరిస్థితుల్లో విడుదలైనా భారీ విజయాన్ని సాధించి 'వందకోట్ల' ఆశలు రేకెత్తించింది. 'తాటతీస్తా' అంటూ చిత్రవిజయోత్సవ సభలో పైరసీదారులను హెచ్చరించి మరోసారి చర్చల్లో నిలిచారు. 'ఫలానా పార్టీలో పవన్‌ చేరుతున్నారు'అంటూ వార్తలు వచ్చాయి. 'గబ్బర్‌సింగ్‌2'ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారిప్పుడు. 2014లో 'కోబలి'ని మొదలెట్టే సూచనలున్నాయి. పీవీపీ సంస్థ నిర్మించే చిత్రంలో పవన్‌ నటిస్తారు. దీంతో పవన్‌ హంగామా వచ్చే ఏడాదీ కొనసాగే అవకాశాలున్నాయి.

బలుపు

బలుపు

ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న విజయం రవితేజకు 'బలుపు'తో దక్కింది. ఆ తరవాత కొంతకాలం ఆయన షూటింగులకు సెలవు తీసుకొన్నారు. ఇప్పుడు బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకొన్నారు. ఈఏడాది ఆయన బాలీవుడ్‌కి వెళ్తారని ప్రచారం జరిగింది. రవితేజ కోసం హరీష్‌ శంకర్‌, వీరూపోట్ల కథలు సిద్ధం చేసుకొంటున్నట్లు తెలుస్తోంది. అంటే 2014లో మునుపటి రవితేజని చూడొచ్చు.

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేశారు. ఈ విజయంతో మల్టీస్టారర్‌ సినిమాలకు ద్వారాలు పూర్తిగా తెరుచుకొన్నాయి. మరోవైపు మహేష్‌ దూకుడు పెంచారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న '1' సెట్స్‌పై ఉండగానే, శ్రీనువైట్ల 'ఆగడు'కు పచ్చజెండా వూపేశారు. '1' సంక్రాంతికి విడుదల కాబోతోంది. వైజయంతీ మూవీస్‌పై ఓ సినిమా చేయడానికి ఆయన అంగీకరించారు. కొరటాల శివ కూడా మహేష్‌ కోసం ఓ కథ సిద్ధం చేసుకొన్నారు. 2013లో బిజీ స్టార్‌ ఎవరంటే మహేష్‌బాబు అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన డైరీలో ఒక్క రోజు కూడా ఖాళీ లేదాయె. ఆఖరికి తనయ సితార పుట్టిన రోజు కూడా ఆయన సెట్లోనే జరుపుకొన్నారు.

'నాయక్‌'

'నాయక్‌'


ఈ ఏడాది రామ్‌చరణ్‌కి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. 'నాయక్‌'తో 2013 విజయాలకు బోణీ కొట్టింది ఆయనే. అయితే ఆ తరవాత కలసి రాలేదు. బాలీవుడ్‌లో చేసిన 'జంజీర్‌' చేదు అనుభవాలను మిగిల్చింది. 'రొడ్డు మీద ఘర్షణ' వ్యవహారం వివాదాలకు దారితీసింది. 'ఆ సమయంలో నేను అక్కడ లేను' అని చరణ్‌ వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది.'ఎవడు' సినిమా వాయిదాల పర్వం కొనసాగింది. ఇప్పుడు 2014 సంక్రాంతికి 'ఎవడు'ని తీసుకొస్తున్నారు. ఆ తర్వాత వెంకటేష్‌తో కలిసి ఓ మల్టీస్టారర్‌ సినిమా చేయబోతున్నారు. కృష్ణవంశీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారు.

మల్టి స్టారర్ హీరో...

మల్టి స్టారర్ హీరో...

వెంకటేష్ ...'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు'లో పెద్దోడిగా కనిపించి మెప్పించారు. 'మసాలా' నిరాశ పరిచినా... ఇద్దరు హీరోల కథలకు ఇప్పటికీ ఆయనే కేరాఫ్‌ అడ్రస్‌. మల్టీస్టారర్‌ కథల్లో తప్పకుండా ఉండాల్సిన స్టార్‌.. అంటే అది వెంకటేష్‌ అనిపించేలా పరిస్థితి తయారైంది. రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తారు. మారుతి దర్శకత్వంలో నటించడానికి కూడా అంగీకరించారు. 2014 జనవరిలో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. బాలీవుడ్‌లో వచ్చిన 'ఓమైగాడ్‌'ని రీమేక్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. వివేకానంద బోధనల్ని సినిమాగా చూపించాలనేది ఆయన ఆశ. సరైన దర్శకుడి కోసమే ఆగారు.

'మిర్చి'

'మిర్చి'


2013లో ఆయన 'మిర్చి'తో ప్రభాస్ విజయం సాధించారు. ఆవెంటనే 'బాహుబలి' కోసం రంగంలోకి దిగిపోయారు. రెండేళ్ల పాటు తన కాల్షీట్లన్నీ ఈ సినిమాకే కేటాయించారు. తన పెళ్లి కూడా 'బాహుబలి' తరవాతే అంటున్నారు. 2014మొత్తం ఆయన ఈ సినిమా సెట్స్‌లోనే ఉంటారు. కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీ, దేహదారుఢ్యం కోసం కసరత్తులూ... ఇలా ఈ సినిమా కోసం కఠోర శ్రమ చేస్తున్నారు. షూటింగ్‌ సందర్భంగా ప్రభాస్‌ గాయపడ్డారని పుకార్లు వచ్చాయి. 'అదేం లేదు. నేను బాగానే ఉన్నా' అంటూ ప్రభాస్‌ ఇచ్చిన వివరణతో అభిమానులు వూపిరి పీల్చుకొన్నారు.

'బాద్‌షా'

'బాద్‌షా'


2013లో 'బాద్‌షా', 'రామయ్యా వస్తావయ్యా' సినిమాలతో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకొచ్చారు ఎన్టీఆర్‌. 'దూకుడు' తరవాత శ్రీనువైట్ల, 'గబ్బర్‌ సింగ్‌' తరవాత హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన సినిమాలివి. 'బాద్‌షా' ఫర్వాలేదు అనిపిస్తే - 'రామయ్యా...' మాత్రం నిరాశ పరిచింది. ఇప్పుడాయన సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాకి 'రభస' అనే పేరు పరిశీలిస్తున్నారు. 2014 ప్రారంభంలో సుకుమార్‌ దర్శకత్వంలో నటించే అవకాశాలున్నాయి.

English summary
It is naturally very difficult to decide who among the Tollywood actors are the best. Here is the list of the top heroes in Telugu film industry, in no particular order. Mahesh Babu, Pawan Kalyan, Jr Ntr, Prabhas and Ram Charan Teja have made it to the top five list of heroes in Tollywood based on the Box Office collections. Each actor is spectacular in their own films and the Box Office records can prove that.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu