»   » మూడో వసంతంలోకి అడుగు పెట్టిన ‘24ఎఎం స్టూడియోస్’

మూడో వసంతంలోకి అడుగు పెట్టిన ‘24ఎఎం స్టూడియోస్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ సౌత్ సినీ నిర్మాణ సంస్థ '24ఎఎం స్టూడియోస్' మూడో వసంతంలోకి అడుగు పెట్టింది. శివకార్తికేయన్, కీర్త సురేష్ హీరో హీరోయిన్లుగా ఈ బేనర్లో తెరకెక్కిన తొలి చిత్రం 'రెమో' తమిళనాడు బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలై మంచి విజయం అందుకుంది.

ప్రస్తుతం ఈ సంస్థ 'వేలైక్కారన్' అనే తమిళ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. శివకార్తికేయన్, పహాద్ ఫాజిల్, నయనతార ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎం రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది.

24AM Studios Enters Its Third Year!

24ఎఎం సంస్థ త్వరలో తమ మూడో ప్రాజెక్టుగా నవిన్ పాలీ, ప్రభు రాధాకృష్ణన్ కాంబినేషన్లో ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. దీంతో పాటు త్వరలో రాబోతున్న శివకార్తికేయన్, పోన్‌రామ్ మూవీ నిర్మాణంలో కూడా 24 ఎఎం సంస్థ నిర్మాణ భాగస్వామిగా ఉంది. ఈ చిత్రం లాంచ్ అయిన రోజు శాటిలైట్ రైట్స్ సన్ టీవీ వారు భారీ ధరకు కొనుగోలు చేశారు.

24ఎఎం సంస్థ నిర్మించిన 'వేలైక్కారన్' చిత్రం శాటిలైట్ రైట్స్ కూడా... విజయ్ టీవీ ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది. బేనర్ ప్రారంభమైన మూడో సంవత్సరంలోనే ఇన్ని అచీవ్మెంట్స్ సాధించడం సాధారణ విషయం కాదు. నిర్మాత ఆర్.డి.రాజా 24ఎఎం స్టూడియోస్‌ను ఎంతో సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారనడానికి ఇంతకు మంచిన నిదర్శనం ఏముంటుంది అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

English summary
24AM Studios is in its successful third year of production. The first production of the banner, Remo starring Sivakarthikeyan and Keerthy Suresh in the lead roles, was a blockbuster hit. The second venture of 24AM Studios, the M Raja movie Velaikkaran, which stars Sivakarthikeyan, Fahadh Faasil, and Nayantara, is in the post-production stage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu