»   » మూడు మిలియన్ల మన్మథుడు: ప్ర‌పంచ‌వ్యాప్తంగా 260కి చేరిన నాగార్జున ర్యాంక్

మూడు మిలియన్ల మన్మథుడు: ప్ర‌పంచ‌వ్యాప్తంగా 260కి చేరిన నాగార్జున ర్యాంక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

డిజిట‌ల్ యుగంలో ట్విట్ట‌ర్ అనేది ప్ర‌తి ఒక్క‌రికి చాలా ద‌గ్గ‌రైంది. క‌ష్టాలతో పాటు ఇష్టాలను పంచుకునే వీలు ఇందులో ఉండ‌డంతో అంద‌రు ట్విట్ట‌ర్ ని వాడుతున్నారు . ఇక సెల‌బ్రిటీల సంగతైతే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఫ్యాన్స్ తో చాలా ద‌గ్గ‌ర‌గా ఉండేందుకు ట్విట్ట‌ర్ ని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. సినిమా విష‌యాల‌నే కాక ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో షేర్ చేసుకుంటున్నారు సినీ స్టార్స్

అక్కినేని నాగార్జున సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటారు. అందుకే ఆయ‌న‌కు ఫాలోవ‌ర్ల సంఖ్య కూడా ఎక్కువే. ఇటీవ‌లే ఆయ‌న ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్ల సంఖ్య 30 ల‌క్ష‌లకు చేరుకుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్ల సంఖ్య‌లో నాగార్జున ర్యాంకు 260. ట్విట్ట‌ర్ కౌంట‌ర్‌ అనే వెబ్‌సైట్ ద్వారా ఆయ‌న అభిమాని ఒక‌రు విష‌యాన్ని నాగార్జున ట్విట్ట‌ర్ వాల్‌పై పోస్ట్ చేశారు.

3 million Twitter followers for Nagarjuna

దానికి నాగార్జున ఇంత అభిమానం చూపిస్తున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు అంటూ స‌మాధాన‌మిచ్చారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్ల సంఖ్య‌లో మొద‌టి ర్యాంకు పాప్ సింగ‌ర్ కేటీ పెర్రీది. ఈమెకు 10,23,16,810 మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. టాప్ 100లో న‌రేంద్ర‌మోదీ, అమితాబ్ బ‌చ్చ‌న్‌, స‌ల్మాన్ ఖాన్, ఆమిర్‌ఖాన్‌, దీపికా ప‌దుకొనె, అక్ష‌య్ కుమార్‌, ప్రియాంక చోప్రా, హృతిక్ రోష‌న్‌, స‌చిన్ టెండూల్క‌ర్‌, విరాట్ కొహ్లీ ఉన్నారు.

English summary
Nagarjuna now has 3 million followers on Twitter. Nag is next only to Telugu stars like Mahesh Babu, Rajamouli and Rana who have 3 million plus followers on the popular micro-blogging site.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu