»   » మోహన్ లాల్... మూడు నెలల్లో రూ. 200 కోట్లు!

మోహన్ లాల్... మూడు నెలల్లో రూ. 200 కోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు మళయాలంలో బాక్సాఫీసును షేక్ చేసిన మళయాలం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆ తర్వాత చాలా ప్లాపులు ఎదుర్కొన్నాడు. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో తన కెరీర్ ను గాడిలో పెట్టుకున్నాడు ఈ సూపర్ స్టార్. ఇపుడు ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ రెండు నెలల్లోనే మోహన్ లాల్ మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో మాళీవుడ్ బాద్ షాగా మారిపోయాడు. దీంతో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. కేవలం రెండు నెలల వ్యవధిలో రూ. 200 కోట్ల కలెక్షన్ సాధించి రీజనల్ సినిమాల స్టామినాను మరోసారి ప్రూవ్ చేసాడు. ఇటీవల తెలుగులో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీలో మోహన్ లాల్ కీలక పాత్రలో నటించాడు. దాదాపు హీరోకు సమానమైన పాత్రలో నిపించిన మోహన్ లాల్. సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది.

English summary
This is the third consecutive blockbuster of Mohanlal in last one and half month and now a terrific trade analysis had come out. In last 42 days, 3 Mohanlal movies done a business around 200 crores in box office and it is just stunning.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu