»   » మూడు టికెట్ల కోసం 36 లక్షలా..!? అభిమానం అంటే ఇదేనా..!!?

మూడు టికెట్ల కోసం 36 లక్షలా..!? అభిమానం అంటే ఇదేనా..!!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. ఒక్కరోజు గ్యాప్‌లో వారిద్దరి సినిమాలు విడుదల కాబోతున్నాయి. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ 11న ఖైదీ వస్తుంటే.. దేశం మీసం తిప్పుదాం అంటూ 12న శాతకర్ణి రంగంలోకి దిగుతున్నాడు. ఇద్దరికీ ఈ రెండు సినిమాలు ప్రతిష్ఠాత్మకమైనవి కావడంతో ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద హీట్ పుట్టేసింది.

హీరోలు పరస్పరం అభినందనలు, ఆల్ ద బెస్ట్‌లు చెప్పుకొంటున్నా.. మెగా అభిమానులు, నందమూరి అభిమానులు మాత్రం నువ్వా..నేనా అన్నట్టు రెండు సినిమాల విడుదల కోసం సన్నద్ధమయ్యారు. బాలయ్య సినిమా ఇప్పటికే భారీ అంచనాలతో వస్తూంటే.... చిరుకూడా పదేళ్ళ గ్యాప్ తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు

ఇక చిరు "కాస్త ప్రత్యేకం".., ఎప్పుడెప్పుడు వస్తాడా? ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా? అన్నంత ఆత్రంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. రాక..రాక పదేళ్ల గ్యాప్ తర్వాత వస్తుండడంతో ఎంత ఖర్చైనా ఫర్వాలేదు.. తొలిరోజు తొలి షో చూసి తీరాల్సిందే అన్న పట్టుదలతో ఉన్నారు మెగా అభిమానులు.

3 tickets 36 lacs for Chiranjeevi movie

అందుకు నిదర్శనం బెంగళూరులో జరిగిన ఓ ఘటనే. ఓ థియేటర్లో 3 ఖైదీ టికెట్లను వేలం వేస్తే.. రూ.36 లక్షలకు దక్కించుకున్నాడట ఓ చిరు అభిమాని. ఇక, ఆ వేలంలో వచ్చిన డబ్బును చిరంజీవి పేరిట బెంగళూరులోని ఓ అనాథాశ్రమానికి విరాళంగా ఇవ్వాలని థియేటర్ యాజమాన్యం భావిస్తోందట.

అంతేగాకుండా.. ఇటు స్పెషల్ షో టికెట్ ధరలూ ఆకాశాన్ని అంటుతున్నాయట. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖైదీకి భారీ స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారని టాక్. టికెట్ ధరలు రూ.500 నుంచి రూ.1500 దాకా పలుకుతున్నాయట. డైరెక్ట్‌గా తీసుకుంటే ఉన్న పరిస్థితి అది. అదే బ్లాక్ మార్కెట్‌లో అయితే డిమాండ్‌ను బట్టి రూ.2500 నుంచి ఆపైన పలుకుతున్నాయని చెబుతున్నారు. అంతేకాదు.. షో ప్రారంభం అయ్యే సమయానికి ఆ రేట్లు మరింత పెరుగుతాయని చెబుతున్నారు.

Read more about: khaidi no 150
English summary
This is a good success for Chiranjeevi's Khaidi No. 150 which has not even been released. The Telugu films has collected Rs 100 crore already. in a Thieter which is in Bengaluru chiru khaidi nem 150 3 tickets collected 3 lacs
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu