For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాంకర్ ప్రదీప్ 30 రోజుల ప్రేమ.. ఆగలేకపోతున్నా అంటూ అనసూయ రియాక్షన్

  |

  బుల్లితెర టాలెంటెడ్ యాంకర్లలో ఒకరిగా భారీ పాపులారిటీ తెచ్చుకున్నాడు ప్రదీప్. తనదైన స్టైల్లో సమయానుసారంగా పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్స్ వదిలే ఆయన అనతికాలంలోనే ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యాడు. ముఖ్యంగా అల్టిమేట్ డ్యాన్సులతో ఉర్రూతలూగించే ఆయన తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకొని బుల్లితెర కింగ్ అయ్యాడు. ఇక ఇప్పుడు వెండితెరపై కూడా తన సత్తా చాటేందుకు గాను హీరోగా రంగంలోకి దిగుతున్నాడు యాంకర్ ప్రదీప్. ఈ నేపథ్యంలో ఆయన ఎంట్రీపై అనసూయ ఆసక్తికరంగా స్పందించింది. వివరాల్లోకి పోతే..

  బుల్లితెర వీరులు కాస్త వెండితెర హీరోలుగా..

  బుల్లితెర వీరులు కాస్త వెండితెర హీరోలుగా..

  బుల్లితెరపై అలరించి భారీగా ఫాలోయింగ్ తెచ్చుకున్న యాంకర్స్ మెల్లగా వెండితెర బాట పట్టేసి ఆడియన్స్ మనసు దోచుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే యాంకర్ రష్మీ, అనసూయ లాంటి వారు వెండితెరపై రాణిస్తుండగా ఇటీవలే సుడిగాలి సుధీర్ కూడా హీరోగా వెండితెరపై కాలుమోపాడు. ఇప్పుడు అదే బాటలో యాంకర్ ప్రదీప్ సైతం వెళుతుండటం విశేషం.

  30 రోజుల్లో ప్రేమించటం ఎలా

  30 రోజుల్లో ప్రేమించటం ఎలా

  ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా' అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమాతో యాంకర్ ప్రదీప్ వెండితెర ఎంట్రీ ఇస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర ‘ఆర్య 2', ‘నేనొక్కడినే' సినిమాలకు పనిచేసిన మున్నా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌లను రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ చేశారు.

  యాంకర్ ప్రదీప్‌కు రానా సపోర్ట్

  యాంకర్ ప్రదీప్‌కు రానా సపోర్ట్

  ప్రదీప్ హీరోగా రాబోతున్న ఈ సినిమాకు మొదటగానే రానా సపోర్ట్ లభించింది. ఆయన చేతుల మీదుగానే ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ల కాన్సెప్టు, సంగీతం తనకు బాగా నచ్చినది తెలిపిన రానా.. ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా' బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

  బాణం విసురుతున్న మన్మథుడు.. టైటిల్‌ డిజైన్

  బాణం విసురుతున్న మన్మథుడు.. టైటిల్‌ డిజైన్

  ఇక ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో పల్లెటూరి కుర్రాడి వేషంలో ప్రదీప్ కనిపించాడు. ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజా పోస్టర్‌లో ఈ ఇద్దరూ ఎంతో కులాసాగా కనిపిస్తున్నాడు. సూర్యోదయం, జలపాతాలు, పక్షులు, చెట్లతో బ్యాగ్రౌండ్ ఒక అందమైన పెయింటింగ్‌ను తలపిస్తోంది. బాణం విసురుతున్న మన్మథుడు, గులాబీ, లవ్ లెటర్, తాళం వేసిన హృదయం వంటి వాటితో ఆ టైటిల్‌ను రూపకల్పన చేశారు. ఈ డిజైన్ బాగా ఆకట్టుకుంటోంది.

  షూటింగ్ ఫినిష్.. రిలీజ్ డేట్

  షూటింగ్ ఫినిష్.. రిలీజ్ డేట్

  ఎస్.వి. ప్రొడక్షన్స్ పతాకంపై సక్సెస్‌ఫుల్ కన్నడ నిర్మాత ఎస్.వి. బాబు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. త్వరలోనే చిత్ర విడుదల తేదీని అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.

  Nagababu Re-Entry Rumors Into Jabardasth || Filmibeat Telugu

  యాంకర్ అనసూయ రియాక్షన్

  కాగా ఈ ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా' పోస్టర్ చూసిన అనసూయ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయింది. ''ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్ ప్రదీప్. నీ లుక్ చాలా బాగుంది. సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. నీవు హీరోగా మారడం చాలా గర్వంగా ఉంది'' అని పేర్కొంది.

  English summary
  Anchor Pradeep Machiraju re enter into the Dhee Champions show. The first episode is veru much intresting with Pradeep punches on Sudheer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X