twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    34 సంవత్సరాల క్రితం సీఎంగా కృష్ణ... ఇపుడు మహేష్ బాబు (వైరల్ ఫోటో)

    By Bojja Kumar
    |

    మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' చిత్రం ఏప్రిల్ 20న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. సాధారణంగానే మహేష్ బాబు సినిమా అంటేనే అంచనాలు ఓ స్థాయిలో ఉంటాయి. ఈ చిత్రంలో మహేష్ తొలిసారి ముఖ్యమంత్రిగా నటిస్తుండటం, ఆసక్తికరమైన పొలిటికల్ ఎంటర్టెనర్ కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. సెన్సార్ టాక్, ట్రయల్ షోల నుండి ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

    34 సంవత్సరాల క్రితం

    34 సంవత్సరాల క్రితం

    కాగా.... మహేష్ బాబు తొలిసారిగా ముఖ్యమంత్రిగా నటిస్తున్న వేళ ఆయన తండ్రి కృష్ణ నటించిన సినిమా పోస్టర్ ఇంటర్నెట్లో వైరల్ అయింది. సరిగ్గా 34 సంవత్సరాల క్రితం కృష్ణ ‘ముఖ్యమంత్రి' అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి విజయ నిర్మల దర్శకత్వం వహించారు. అప్పట్లో ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. విడుదలైన తొలి వారంలోనే రూ. 52,13,169 వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది.

    మహేష్ మూవీ కూడా అదే స్థాయిలో రికార్డులు

    మహేష్ మూవీ కూడా అదే స్థాయిలో రికార్డులు

    మళ్లీ 34 సంవత్సరాల తర్వాత తండ్రి తరహాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తుండటంతో.... ‘భరత్ అనే నేను' సినిమా కూడా టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొట్టే స్థాయిలో ఉంటుందని చర్చ జరుగుతున్న తరుణంలో.....కృష్ణ నటించిన సినిమా పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి.

    అందరిలోనూ ఆసక్తి

    అందరిలోనూ ఆసక్తి

    ఇప్పటి వరకు మహేష్ బాబు పొలిటికల్ ఎంటర్టెనర్ చేయలేదు. మరి ఆయన ఈ తరహాలో చేస్తున్న తొలి సినిమా కావడంతో ముఖ్యమంత్రిగా ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది? ప్రేక్షకులను అతడి సరికొత్త పాత్ర ఏ మేరకు అలరిస్తుంది అనేది హాట్ టాపిక్ అయింది.

    కనీవినీ ఎరుగని రీతిలో రిలీజ్

    కనీవినీ ఎరుగని రీతిలో రిలీజ్

    ‘భరత్ అనే నేను' చిత్రాన్ని కనీవినీ ఎరుగని రీతిలో విడుదల చేస్తున్నారు. యూఎస్ఏలో నేడు 2వేల ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్లలో ఈ చిత్రాన్ని విడదుల చేస్తున్నారు.

    అభిమానులను ఊరిస్తున్న 10 నాన్ బాహుబలి రికార్డులు

    అభిమానులను ఊరిస్తున్న 10 నాన్ బాహుబలి రికార్డులు

    నాన్ బాహుబలి కేటగిరీలో మొత్తం 10 రికార్డులు అభిమానులను ఊరిస్తున్నాయి.

    1. యూఎస్ఏ ప్రీమియర్స్ హయ్యెస్ట్ గ్రాస్: అజ్ఞాతవాసి ($1,514,000)
    2. బిగ్గెస్ట్ ఓపెనర్ ఇన్ వరల్డ్ వైడ్ మార్కెట్: అజ్ఞాతవాసి (రూ. 60.50 కోట్లు)
    3. ఓపెనింగ్ వీకెండ్ హయ్యెస్ట్ గ్రాసర్: ఖైదీ నెం.150 (రూ. 95.40 కోట్లు)
    4. ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల గ్రాస్ : ఖైదీ నెం. 150 (6రోజుల్లో)
    5. ఫాస్టెస్ట్ $2 మిలియన్ డాలర్ యూఎస్ఏ గ్రాసర్: ఖైదీ నెం. 150( 6 రోజుల్లో)
    6. హయ్యెస్ట్ గ్రాసర్ యూఎస్ఏ : రంగస్థలం ($3.38 మిలియన్ నేటి వరకు)
    7. హయ్యెస్ట్ గ్రాసర్ ఓవర్సీస్ మార్కెట్: రంగస్థలం( రూ. 30 కోట్లు ఇప్పటి వరకు..)
    8. హయ్యెస్ట్ గ్రాసర్ ఇన్ తెలుగు స్టేట్స్: రంగస్థలం (రూ. 125 కోట్లు ఇప్పటి వరకు)
    9. హయ్యెస్ట్ గ్రాసర్ ఇన్ గ్లోబల్ మార్కెట్: రంగస్థలం (రూ. 182 కోట్లు ఇప్పటి వరకు)
    10. రూ. 200 కోట్ల గ్రాసర్..... (నాన్ బాహుబలి కేటగిరీలో ఇప్పటి వరకు ఏదీ లేదు)

    English summary
    Mahesh Babu's most anticipated film Bharat Ane Nenu releasing tomorrow. Mahesh plays the Chief Minister role in this movie. Did you know this? Mahesh Babu's father Krishna also played a chief minister some 34 years ago. Krishna's political flick was titled Mukhyamantri where he was seen playing Chief Minister where he was cast opposite Ambika.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X