»   » రామ్ గోపాల్ వర్మ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ ఇదిగో (ఫొటోలు)

రామ్ గోపాల్ వర్మ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ ఇదిగో (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా అందులో సెన్సేషన్ క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తూంటారు. ముఖ్యంగా ఆయన తన చిత్రాల ప్రమోషన్ విషయంలో రకరకాల విభిన్న మార్గాలు అనుసరిస్తూంటారు. తాజాగా ఆయనో వెడ్డింగ్ కార్డ్ ని విడుదల చేసి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నారు. పెళ్లి అంటేనే మండిపడే ఆయన వెడ్డింగ్ కార్డు వేయటమేంటి అనుకుంటున్నారా..ఇదిగో ఇక్కడ ఉన్న ఫొటో చూడండి..మీకే అర్దం అవుతుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


వర్మ తాజా చిత్రం "365 డేస్" ప్రమోషన్ కోసం ఈ ఇన్విటేషన్ ని ముద్రించి వదిలారు. ఈ ఇన్విటేషన్ లో ఆయన ఈ చిత్రం ఆడియో పంక్షన్ వివరాలను ఇచ్చారు. ఏప్రియల్ 23 సాయింత్రం ..తాజ్ దక్కన్ లో ఈ ఆడియో పంక్షన్ జరగనుంది.


“365 Days” :RGV’s Wedding invite

కత్తులు, తుపాకులు, గ్యాంగ్ స్టర్లు, టెర్రరిస్టులు, దెయ్యాలు, భూతాలు నేపధ్యంలోనే తన పాతికేళ్ల కెరీర్ లో ఎప్పుడూ సినిమాలు తీసారు రామ్ గోపాల్ వర్మ. ఆయన సినిమాల్లోని పాత్రలు అయితే క్రిమినల్స్...లేదా క్రిమినల్ సిట్యువేషన్స్ లో ఉండటమే జరుగుతూంటాయి. అడపాదడపా ఏమైనా రొమాంటిక్ సినిమాలు తీసినా అవి ఫిలిం ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ లోనే, లేక ఏదో థ్రిల్లర్ ఎలిమెంట్ బ్యాక్ గ్రౌండ్ లోనో రూపొందుతాయి. లాంటి రామ్ గోపాల్ వర్మ తన కెరీర్ లో మొట్టమొదటిసారిగా ఒక ఫుల్ ప్లెడ్జెడ్ లవ్ స్టోరీ తీసాడు.


ఈ సినిమాలో వయెలెన్స్ అనేది మచ్చుకు కూడా లేకపోవటం వలన ఇప్పటివరకూ రామ్ గోపాల్ వర్మ తీసిన మిగతా సినిమాలన్నిటిలోనూ ప్రత్యేకంగా నిలవనుంది. ఈ చిత్రం పేరు 365 డేస్. పెళ్లి తర్వాత ప్రేమ ఎలా ఉంటుంది అనే అంశం నేపధ్యంలో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలో విడుదలకి సిద్దమవుతోంది.


“365 Days” :RGV’s Wedding invite

చిత్ర నిర్మాత డి. వెంకటేష్‌ మాట్లాడుతూ '' '365 డేస్‌'లో నాకు విపరీతంగా నచ్చిన అంశం ఏంటంటే వర్మ తన 25 ఏళ్ల కెరియర్‌లో 100% పూర్తి లవ్‌, రొమాంటిక్‌ చిత్రం చేయడం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రం చూసినవాళ్లు ఈ చిత్రకథ ప్రతి ప్రేమజంటకి ప్రతి పెళ్ళైనజంటకి కూడా కనెక్ట్‌ అవుతుందని చెప్తున్నారు.


365 డేస్‌ ఒక్క రామ్‌ గోపాల్‌ వర్మ పెళ్లి కధే కాదు, ప్రతి ఒక్కరి ప్రేమ కథ. ప్రతి ఒక్కరి పెళ్లి కథ. ఈ అందమైన పెళ్లి కథకు ప్రేక్షకులందరూ కదలి రావాలని రామ్‌ గోపాల్‌ వర్మ పిలుపు నివ్వబోతున్నారు.' అన్నారు.


“365 Days” :RGV’s Wedding invite

నిఖితశ్రీ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్‌ పతాకంపై డి. వెంకటేష్‌ ఈ సంవత్సరంలో మూడు సినిమాలు నిర్మించబోతున్నారు. దీనిలో భాగంగా ఆయన మొదట నిర్మించిన చిత్రం రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో '365 డేస్‌'. ఈ సినిమా విడుదల కాగానే మరో సినిమా కూడా మే నుంచే ప్రారంభించబోతున్నట్లు నిర్మాత ప్రకటనలో పేర్కొన్నారు. ఇవి కాకుండా మరో లవ్‌ స్టొరీ స్క్రిప్ట్‌ పై కూడా ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి.

English summary
As you could see the invite, it is about 365 days audio getting married with music lovers. What a fantastic thought it is. On April 23rd evening, this wedding is going to take place at Taj Deccan.
Please Wait while comments are loading...