»   » 50 డేస్ స్పెషల్: ‘టెంపర్’ బెస్ట్ సీన్స్ గురించి...

50 డేస్ స్పెషల్: ‘టెంపర్’ బెస్ట్ సీన్స్ గురించి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ కెరీర్లోని బెస్ట్ హిట్ చిత్రాల లిస్టులో ఈచిత్రం కూడా చోటు దక్కించుకుంది. గత కొంత కాలంగా విజయం కోసం ఎదురు చూస్తున్న ఎన్టీఆర్, ఆయన అభిమానులకు ఈ చిత్రం ఫలితాలు పూర్తి స్థాయిలో సంతృప్తిని ఇచ్చాయి.

వక్కతం వంశీ రాసిన పవర్ ఫుల్ అండ్ ఎమోషనల్ పోలీస్ డ్రామాను తనదైన రీతిలో దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తే....పెర్ఫార్మెన్స్ పరంగా జూ ఎన్టీఆర్ వందశాతం న్యాయం చేసాడు. ముఖ్యంగా పూరి రాసిన డైలాగులు, వాటిని అద్భుతంగా డెలివరీ చేసిన ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్.


థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు సినిమా మొదలైనప్పటి నుండి ఎండ్ అయ్యే వరకు ఎక్కడ ఫ్లో తగ్గకుండా స్పీడుగా, ఆసక్తికరంగా స్ర్కీన్ ప్లే కొనసాగిస్తూ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాలో ఎన్నో అద్భుతమైన సీన్లు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ ..కరెప్టెడ్ నుంచి పూర్తిగా మారి పశ్చాత్తాపపడుతున్నప్పుడు పోసాని సెల్యూట్ కొట్టే సీన్, అక్కడ ఎన్టీఆర్ ఎక్సప్రెషన్స్ అద్బుతమనిపిస్తాయి. అంతేకాదు.. క్లైమాక్స్ లో కోర్టులో మన సమాజాన్ని, న్యాయ వ్వవస్దని నిలదీస్తూ డైలాగులు చెప్పేటప్పుడు పెద్ద ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు.ప్రకాష్ రాజ్, ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేసాలు కూడా బాగా పేలాయి. డాన్స్ లలో ఎప్పటిలాగే ఎన్టీఆర్ అదరకొట్టారు. ముఖ్యంగా టైటిల్ సాంగ్ లో ఎన్టీఆర్ స్టెప్స్ మరీ మరీ చూడాలనిపించేలా ఉన్నాయి.


నందమూరి ఫ్యామిలీ రెఫరెన్సెస్

నందమూరి ఫ్యామిలీ రెఫరెన్సెస్

మాస్ పల్స్ బాగా తెలిసిన తెలుగు డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు. నందమూరి అభిమానులను మరింత ఉత్తేజ పరిచేందుకు సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ పోలీస్ సీన్లను కూడా టెంపర్లోచూపించాడు.


సెల్యూట్ సీక్వెన్స్

సెల్యూట్ సీక్వెన్స్

ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళీ తన కెరీర్లోనే బెస్ట్ రోల్ చేసారు. అవినీతి ఎన్టీఆర్ కు సెల్యూట్ చేయక పోవడం...అతనిలో మార్పు వచ్చేలా ప్రవర్తించడం, చివరకు సెల్యూట్ చేయడం లాంటి సీన్లు సినిమాకు మేజర్ హైలెట్.


కోర్టు ఎపిసోడ్

కోర్టు ఎపిసోడ్

టెంపర్ సినిమా సక్సెస్ కావడానికి ప్రధాన కారణం కోర్టు సీక్వెన్స్. అప్పటి వరకు స్పీడుగా సాగిన సినిమా క్లైమాక్స్ లో మలుపు తిరుగుతుంది. ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తుంది. సినిమా సక్సెస్ కావడంలో క్లైమాక్స్ హైలెట్.


ఎయిర్ పోర్టు సీన్

ఎయిర్ పోర్టు సీన్

ఎయిర్ పోర్టు సీన్లో జూ ఎన్టీఆర్, మధురిమ మధ్య వచ్చే సన్నివేశాలు, సంబాషణలు ఆసక్తికరంగా ఉంటాయి. హీరో క్యారెక్టర్లో మార్పు రావడంలో ఈ సీన్లు కీలకం.


తనికెళ్ల భరణి సీన్

తనికెళ్ల భరణి సీన్

ఈ చిత్రంలో తనికెళ్ల భరని చేసింది చిన్న పాత్రే అయినా...హీరో క్యారెక్టరకు ఆ పాత్ర లింకు అద్భుతంగా ఉంటుంది.


పూరి జగన్నాథ్ సర్‌ప్రైజ్

పూరి జగన్నాథ్ సర్‌ప్రైజ్

ఈ చిత్రంలో పూరి జగన్నాథ్ సర్‌ప్రైజ్ ఎంట్రీ కూడా అభిమానులతో కేక పెట్టించింది.


ప్రకాష్ రాజ్ డాన్స్

ప్రకాష్ రాజ్ డాన్స్

ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో విలన్ పాత్రకే పరిమితం కాకుండా ఐటం సాంగులో అదిరిపోయేలా స్టెప్పులేసాడు.


సరికొత్త కాన్సెప్టు

సరికొత్త కాన్సెప్టు

సినిమాలో విలన్, హీరో మధ్య ఫ్రెండ్సిఫ్ సరికొత్త కాన్సెప్టుతో సాగుతుంది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి.


English summary
Jr NTR's Temper successfully completed 50 days of run at the box office. Temper has managed to spin record collections and has made a place for itself at the top charts of the current money spinners list.
Please Wait while comments are loading...