»   » బాహుబలి 2, 50 నిమిషాల సినిమా నెట్ లో పెట్టేసారు : చ..! వీళ్లని ఏం చేయాలి?

బాహుబలి 2, 50 నిమిషాల సినిమా నెట్ లో పెట్టేసారు : చ..! వీళ్లని ఏం చేయాలి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి ఐదేళ్ళ కాలం, వేల మంది శ్రమ తెలుగు సినిమాలో మరచిపోలేని చరిత్రను క్రియేట్‌ చేశాయి.తెలుగు సినిమా హాలీవుడ్ స్థాయిలో ప్రపంచ సినిమా అయ్యింది . విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించారు. బాహుబలి ది బిగినింగ్‌ సినిమా 2015లో విడుదలై 600 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో తెలుగు సినిమా చరిత్రను ప్రపంచానికి తెలియజేశాయి.

బాహుబలి 2

బాహుబలి 2

పార్ట్‌ 1 కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించడంతో బాహుబలి 2 ఎలా ఉంటుందోనని ఆసక్తి మరింత పెరిగింది. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న ఈ రెండేళ్లు అందరిలో క్యూరియాసిటినీ మరింత పెంచింది.ఇన్ని అంచనాలతో వచ్చిన బాహుబలి నిన్న సాయంత్రం నుంచే థియేటర్లలో తన దండయాత్ర మొదలు పెట్టాడు.


సగానికి పైగా సినిమా

సగానికి పైగా సినిమా

అటు ఓవర్సీస్లోనూ, ఇటు భారత దేశం లోనూ మొదలైన బాహుబలి మానియా ఒక రేంజ్ లో ఉంది అయితే ఈ ఆనందాన్ని పూర్తిగా ఫీల్ కూడా అవకముందే ఇప్పుడు బాహుబలి టీమ్ మొత్తం ఒక ఆందోళనలో పడింది... ఇంతకీ కారణం ఏమిటీ అంటే... బాహుబలి సగానికి పైగా సినిమా పైరసీ సైట్ లో కనిపిస్తోంది.....


కొన్ని గంటలు కూడా గడవకుండానే

కొన్ని గంటలు కూడా గడవకుండానే

మీరు చదివింది నిజమే విడుదలై కొన్ని గంటలు కూడా గడవకుండానే 50 నిమిషాల ప్రింట్ బయటకు వచ్చేసింది. హిట్ టాక్ రావడంతో సంతోషంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్, చిత్ర యూనిట్‌ను పైరసీ వ్యవహారం నిరాశకు గురిచేస్తుంది. బాహుబలి2 మొదటి 50 నిమిషాల సినిమా ఆన్‌లైన్‌లో లీకైంది.పోలీసులు దర్యాప్తు చేపట్టారు

పోలీసులు దర్యాప్తు చేపట్టారు

సినిమాను లీక్ చేసిందెవరో తెలుసుకునేందుకు ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నిందితులను కనుగొనే పనిలో పడ్డారు. నిన్న సాయంత్రం ఈ సినిమా బెన్‌ఫిట్ షోను పలుచోట్ల ప్రదర్శించారు. ఆ సమయంలో వీడియోను రికార్డ్ చేసి నెట్‌లో పెట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.50 నిమిషాల సినిమా

50 నిమిషాల సినిమా

బాహుబలి 2 50 నిమిషాల సినిమా హల్‌చల్ చేస్తోంది. పోలీసులు, ఫ్యాన్స్ ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ పైరసీని నియంత్రించలేకపోతున్నారు. పైగా డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా కనిపిస్తుండటంతో ఇంకెంత మందికి ఈ పైరసీ ప్రింట్ షేర్ అవుతుందోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కలవరపాటుకు గురిచేసే విషయం

కలవరపాటుకు గురిచేసే విషయం

ఈ పైరసీ లింక్ వాట్సాప్‌లో వైరల్ అవుతుండటం మరింత కలవరపాటుకు గురిచేసే విషయం. సినిమా విడుదలైన మొదటి రోజే పైరసీ ప్రింట్ అందుబాటులోకి రావడం వెనుక ఎవరెవరున్నారో తెలుసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. దానికంటే ముందు ఆ లింక్ ని తొలగించే ప్రయత్నాల్లో పడ్డారు.English summary
SS Rajamouli’s magnum opus ‘Baahubali2: The Conclusion starring Prabhas, Rana Daggubati has become the latest victim of piracy as the 50 minutes movie has been leaked online before the release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu