»   » నా కెరీర్ లో బెస్ట్ 5 మూవీస్ ఇవే: సమంత

నా కెరీర్ లో బెస్ట్ 5 మూవీస్ ఇవే: సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ రోజుతో (ఫిబ్రవరి 26)..సమంత టాలీవుడ్ లో ఐదవ యానివర్శరీ జరుపుకుంటోంది. దాంతో ఆమె చాలా ఎక్సైటింగ్ ఫీలవుతోంది. కరెక్టుగా ఐదు సంవత్సరాల క్రితం సమంత తొలి చిత్రం నాగ చైతన్య హీరో గా వచ్చిన ఏమి మాయ చేసావే రిలీజై విజయవంతంఅయ్యింది. ఈ నేపధ్యంలో ఆమె తన కెరీర్ లో బెస్ట్ ఐదు చిత్రాలు గురించి చెప్పుకొచ్చింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక సమంత ఈ సంవత్సరం కూడా యాడ్ లతో పూర్తి బిజీగా ఉండేటట్లు కనపడుతోంది. కొత్త కమిట్ మెంట్స్ తో ఆమె బిజీగా ఉంది. ఈ సంవత్సరం కొన్ని కమిట్ మెంట్ కు సంభందించి మీకు అనౌన్స్ మెంట్ ఇవ్వాలి. మంచి సమయం కోసం ఎదురుచూస్తున్నాను...అంటూ ట్వీట్ చేసి మరీ అనౌన్సమెంట్ ఇచ్చేసింది. ప్రముఖ ఆభరణాల తయారీదారు జ్యూయల్ వన్ కు ఆమె ఎండార్సమెంట్ జరిగిందని, షూటింగ్ జరిగిందని చెప్పింది. ఇప్పుడా ఫొటోలు మీరు క్రింద చూస్తున్నవి. ఓ ప్రక్క సినిమా షూటింగ్ లు మరో ప్రక్క ఇలా యాడ్స్ తో ఆమె ఫుల్ బిజీగా ఉంది.

అలాగే హీరోయిన్ సమంత కొంత కాలం పాటు ట్విట్టర్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సమంత దాన్ని పది రోజులు పాటు కూడా దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. తాజాగ ఆమె తెలుగు ఇండస్ట్రీలో ఐదు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఓ ట్వీట్ రాసింది. సమంత ట్వీట్ లో... "నా ఏమి మాయ చేసావే చిత్రం రిలీజై అప్పుడే ఐదు సంవత్సరాలు గడిచిపోయింది. ఏమి మాయ చేసావే..ఓ స్పెషల్ సినిమా. ఇదంతా ఓ అద్బుతమైన ప్రయాణం. ఇక్కడ ఉన్నందుకు చాలా ఆనందంగనూ గర్వంగానూ ఉంది," అంది.

ఇంతకీ సమంత చెప్పిన ఐదు చిత్రాలు స్లైడ్ షోలో..

ఏమి మాయ చేసావే

ఏమి మాయ చేసావే

2010 లో విడుదలైన ఈ చిత్రం సమంత కెరీర్ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయింది. నాగచైతన్య తో ఆ తర్వాత ఆమె ఆటోనగర్ సూర్య, మనం చిత్రాలు చేసినా ఈ చిత్రమై తనకు ప్రత్యేకమైనది అని చెప్తోంది. గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి దర్శకుడు

దూకుడు

దూకుడు

2011లో వచ్చిన ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్ కే కాక, దర్శకుడు శ్రీనువైట్లకు,సమంతకు కలిసి వచ్చింది. ఈచిత్రం ఘనవిజయంతో ఆమెకు వరసగా పెద్ద హీరోల సరసన ఆఫర్స్ వచ్చాయి.

ఈగ

ఈగ

రాజమౌళి దర్శకత్వంలో 2012 లో వచ్చిన ఈ చిత్రంలో నాని హీరో. ఈ చిత్రం పెద్ద విజయం సాధించటమే కాద ప్రపంచవ్యాప్తంగా రిలైజై అన్ని చోట్లా హిట్ అయ్యి..ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది

2013 లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత చేసిన నటనకు మంచి మార్కులే పడ్డాయి. చిత్రం ఘన విజయం సాధించి ఆమెను నెంబర్ వన్ ప్లేస్ లో నిలబెట్టింది.

మనం

మనం

2014లో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీలను బాగా ఆకట్టుకుని ఘన విజయం సాధించింది.

English summary
“Ye Maya Chesave (2010), Dookudu (2011), Eega (2012), Attarintiki Daredi (2013), Manam (2014) are the five best films of mine in Telugu”, said Samantha, while sharing her feelings about Ye Maya Chesave fifth anniversary.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu