Just In
- 23 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 11 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- Sports
మౌమా, సుధా సింగ్‌తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- News
వెర్టికల్ ఛార్లీ స్పెషల్ అట్రాక్షన్: విన్యాసాల కోసం ఎదురు చూపులు: కాస్సేపట్లో నింగిలోకి
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మళ్లీ అగ్రతారలు మెరిశారు.. 80 నాటి హీరో, హీరోయిన్ల హల్‌చల్.. చిరంజీవి విజేత

80 దశకంలో దక్షిణాది సినీ పరిశ్రమలో సూపర్‌స్టార్లుగా మెరిసిన నటీనటులు ఆత్మీయంగా కలుసుకొన్నారు. వారి కలయికతో పండుగ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్బంగా అప్పటి మధురస్మృతులను గుర్తు చేసుకొన్నారు.

80 దశకం స్టార్ హీరో హీరోయిన్లు
తాజాగా దక్షిణాదికి చెందిన మరోసారి దిగ్గజ నటీనటులు సమావేశమయ్యారు. ఈ ఆత్మీయ సమావేశానికి చిరంజీవి, వెంకటేష్, శరత్ కుమార్, జాకీ ష్రాఫ్, భాగ్యరాజ్, రాజ్ కుమార్, అర్జున్, నరేష్, భానుచందర్, సుమన్, సురేశ్, రెహ్మన్, సుహాసిని, కుష్బూ, రాధిక శరత్ కుమార్, అంబికా, రాధ, జయసుధ, పూనమ్ థిల్లాన్, పూర్ణిమ భాగ్యరాజ్, రమ్యకృష్ణ, పార్వతీ జయరామ్, సుమలత, లీసి, రేవతి, మేనక, శోభన, నదియా హాజరయ్యారు . మొత్తం 28 మంది ప్రముఖ నటీనటులు పాల్గొన్నారు.

ఒక్కొక్కరుగా తారలు వచ్చారు..
17వ తేదీ నవంబర్‌న జరిగిన పార్టీకి ముందు రోజు రాత్రి ఏడు గంటల నుంచే తారలందరూ ఒక్కక్కరుగా వచ్చారు. ఈ కార్యక్రమం రెండు రోజులపాటు చాలా ఆనందకరమైన వాతావరణంలో జరిగింది. ఈసారి పార్టీ థీమ్ కలర్ ఉదారంగు (పర్పుల్). ఉదారంగు దుస్తులు, పూలచొక్కాలు ధరించి తారలు సందడి చేశారు. ముంబై నుంచి జాకీ ష్రాఫ్, పూనమ్ థిల్లాన్ తరలివచ్చారు.

చిరంజీవి విజేతగా
దిగ్గజ నటీనటుల పార్టీ వేడుకలో ర్యాంప్ వాక్ నిర్వహించారు. మొదట నటీమణులు, ఆ తర్వాత నటులు ర్యాంప్‌పై నడిచారు. హీరోలలో చిరంజీవిని విజేతగా హీరోయిన్లు ప్రకటించడం విశేషం. గాయకుడు శ్రీరాం ఆయా హీరోల పాటలను పాడగా, ఆ పాటల విశిష్టతను, వారి అనుభవాలను హీరో, హీరోయిన్లు పంచుకొన్నారు. రెండురోజుల పార్టీ తర్వాత 19వ తేది రాత్రి వారి వారి షూటింగులకు, నివాసలకు వెళ్లిపోయారు.

తాజా పార్టీ ఫొటోలు వైరల్
తాజాగా ఎనిమిదోసారి జరిగిన ఈ తారల ఆత్మీయ కలయికకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే తమిళనాడులోని మహాబలిపురంలోని ఇంటర్నేషనల్ రిస్టార్టులో ఈ పార్టీని లీసీ, సుహాసిని నిర్వహించారు. ఈ పార్టీకి రాజ్ కుమార్ సేతుపతి, పూర్ణిమా భాగ్యరాజ్, కుష్భూ సహకారం అందించారు.

2009 ప్రారంభమైన ఆత్మీయ కలయిక
80 దశకం నాటి నటీనటులు కలుసుకోవడం 2009లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతీ ఏడాది కలుసుకోవడం జరుగున్నది. ప్రతీసారి ఓ యాక్టర్ పార్టీని నిర్వహించాలనే నిబంధనను పెట్టుకొన్నారు.

సుహాసిని, లీసీలో ఆలోచనకు ప్రతిరూపం
80 దశకంలో సినీ పరిశ్రమను ఏలిన నటీనటులందరూ కలుసుకోవాలనే ఆలోచన హీరోయిన్లు సుహాసిని, లిసీకి వచ్చింది. వారి ఆలోచనను వెంటనే అమల్లోకి తెచ్చి నటీనటులందరిని ఒకచోటికి తెచ్చారు. ప్రస్తుతం ఈ క్లబ్‌లో దక్షిణాదికి చెందిన దిగ్గజ నటీనటులు మొత్తం 32 మంది ఉన్నారు.

2017లో జూన్ నటీనటులు
తాజా భేటికి ముందు గతంలో 2017 జూన్ మొదటివారంలో అగ్ర నటీనటులు కలుసుకొన్నారు. ఆ సమయంలోనే దాసరి నారాయణరావు అకాల మరణం చెందారు. ప్రముఖ నటీనటులంతా చెన్నైలో ఉండటం మూలాన వారు దాసరి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు.