»   » పవన్ వస్తున్నాడు: ‘అ..ఆ’ ఆడియో వెరైటీగా చేస్తున్న త్రివిక్రమ్

పవన్ వస్తున్నాడు: ‘అ..ఆ’ ఆడియో వెరైటీగా చేస్తున్న త్రివిక్రమ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నితిన్, సమంత హీరో హీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అ..ఆ'. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ వివహారి అనే సబ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈచిత్రం ఆడియో మే 2న ప్లాన్ చేసారు.

ఈ చిత్రం ఆడియో వేడుక రోటీన్ గా, సాదా సీదాగా కాకుండా డిఫరెంటుగా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సినిమాపై జనాల్లో పెద్దగా హైప్ లేదు. ఆడియో వేడుక ద్వారా సినిమాపై అంచనాలు పెంచేలా చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు.


A..Aa audio will be unveiled on May 2nd

ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆడియో వేడుకలో కొన్ని స్కిట్లు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రం ఓ పల్లెటూరి ఫ్యామిలీకి, ఓ సిటీ ఫ్యామిలీకి మధ్య ఏర్పడ్డ అంతరాలు అనే పాయింట్‌తో సాగుతుందట. ఈ పాయింటును బేస్ చేసుకుని ఆడియో వేడుక సాగుతుందని అంటున్నారు. మరి త్రివిక్రమ్ ఎలా ప్లాన్ చేసారో తెలియాలంటే మే 2 వరకు ఆగాల్సిందే. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని నితిన్ తెలిపారు.


త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంతనాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయిక గా ' అనుపమ పరమేశ్వరన్'(మలయాళ చిత్రం 'ప్రేమమ్' ఫేం) నటిస్తున్నారు. చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో .. నదియ,అనన్య,ఈస్వరీరావు,సన, గిరిబాబు, నరేష్,రావురమేష్ ,పోసాని, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి లు నటిస్తున్నారు.

English summary
A..Aa will see Samantha playing the lady love opposite Nithiin. Latest reports suggest that Nithiin's A..Aa audio will be unveiled on May 2nd in Shilpakala Vedika.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu