»   » భారీ లాభమే: త్రివిక్రమ్ క్రేజ్ వర్కౌట్ అయింది కానీ... రికార్డ్ మిస్!

భారీ లాభమే: త్రివిక్రమ్ క్రేజ్ వర్కౌట్ అయింది కానీ... రికార్డ్ మిస్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో హీరోల క్రేజ్‌తో సంబంధం లేకుండా కేవలం దర్శకుడి మీద నమ్మకంతో నడిచే సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి దర్శకుల పేర్లు చెప్పాలంటే ముందుగా వినిపించేది రాజమౌళి, త్రివిక్రమ్ పేర్లే.

ఈ మధ్య కాలంలో కేవలం త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ..ఆ' మూవీ అలాందే. అఫ్ కోర్స్ ఇందులో సమంత, నితిన్ ఉన్నప్పటికీ చాలా మంది ఈ సినిమాకు వెళ్లింది త్రివిక్రమ్ మీద నమ్మకంతోనే. తనదైన మార్కు ఫిల్మ్ మేకింగుతో ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టాడు ఈ మాటల మాంత్రికుడు.

సూపర్ హిట్ టాక్ రావడంతో ఈ సినిమాను నిర్మించి నిర్మాతతో పాటు బయ్యర్లు కూడా మంచి లాభాలు సొంతం చేసుకున్నారు. అయితే ఈ సినిమా రూ. 50 కోట్ల షేర్ సాధించడంలో కొద్దిలో మిస్సయింది. అందుకు ఓ కారణం కూడా ఉంది. ఈ సినిమాను పీక్ సమ్మర్ సీజన్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వేసవి చివర్లో విడుదల చేయాల్సి వచ్చింది.

ఆ..ఆ మూవీ విడుదలైన కొద్ది రోజులకే స్కూల్స్ ప్రారంభం కావడంతో మంచి మనీ మేకింగ్ పీరియడ్ ను కోల్పోయినట్లయినట్లయింది. అయినప్పటికీ సినిమా మంచి కలెక్షన్లే సాధించింది. ఓవరాల్ రన్నింగులో మొత్తం రూ. 47.4 కోట్ల షేర్ సాధించింది. థియేటర్ల రెంట్ ఖర్చులు, ఇతర వ్యవయాలు పోను వచ్చిన కలెక్షన్ ఇది. అనుకున్న సమయానికి సినిమా విడుదలై ఉంటే రూ. 50 కోట్ల క్లబ్బులో ఈ సినిమా చేరేదే... అని అంటున్నారు సినీ ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్.

ఈ సినిమాను నిర్మాత ఎంతకు అమ్మాడు.. డిస్ట్రిబ్యూటర్లకు ఎంత లాభం వచ్చింది అనే వివరాలతో పాటు ఏరియా వైజ్ బ్రేక్ ఎంత ఉంది అనే వివరాలు స్లైడ్ షోలో..

థియేట్రికల్ రైట్స్

థియేట్రికల్ రైట్స్


ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 30 కోట్లకు అమ్మేసారు.

డిస్ట్రిబ్యూటర్లు

డిస్ట్రిబ్యూటర్లు


సినిమాకు దాదాపు రూ. 47.4 కోట్లు రావడంతో డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు రూ. 23.4 కోట్ల లాభం వచ్చింది.

నైజాం

నైజాం


నైజాం ఏరియాలో ఈ సినిమా 13.2 కోట్లు వసూలు చేసింది.

ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర


ఉత్తరాంధ్ర ఏరియాలో ఈ సినిమా రూ. 4.3 కోట్లు వసూలు చేసింది.

సీడెడ్

సీడెడ్


సీడెడ్ ఏరియాలో ఈ చిత్రం రూ. 4.2 కోట్లు వసూలు చేసింది.

గుంటూరు

గుంటూరు


గుంటూరు ఏరియాలో ఈ సినిమా రూ. 2.5 కోట్లు వసూలు చేసింది.

ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి


ఈస్ట్ గోదావరి ఏరియాలో ఈ సినిమా రూ. 2.45 కోట్లు వసూలు చేసింది.

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి


వెస్ట్ గోదావరి ఏరియలో ఈ సినిమా 2.05 కోట్లు వసూలు చేసింది.

కృష్ణ ఏరియాలో..

కృష్ణ ఏరియాలో..


కృష్ణ ఏరియాలో ఈ చిత్రం రూ. 2.25 కోట్లు వసూలు చేసింది.

నెల్లూరు

నెల్లూరు


నెల్లూరు ఏరియాలో ఈ సినిమా దాదాపు రూ. 1 కోటి వసూలు చేసింది.

యూఎస్ఏ

యూఎస్ఏ


యూఎస్ఏలో త్రివిక్రమ్ సినిమాలు మంచి డిమాండ్ ఉంది. అందుకే ఈ సినిమా అక్కడ రూ. 10.65 కోట్లు వసూలు చేసింది.

కర్ణాటక

కర్ణాటక


కర్ణాటక ఏరియాలో ఈ చిత్రం రూ. 3 కోట్లు వసూలు చేసింది.

రెస్టాఫ్ ఇండియా

రెస్టాఫ్ ఇండియా


రెస్టాఫ్ ఇండియాలో 80 లక్షలు రాబట్టింది.

రెస్టాఫ్ వరల్డ్

రెస్టాఫ్ వరల్డ్


రెస్టాఫ్ వరల్డ్ లో ఈ చిత్రం రూ. 1 కోటి వరకు రాబట్టింది.

English summary
Trivikram's movie A Aa was sold for around 30 crore and it has collected a distributor share of 47.4 crore in its theatrical run. It could have entered the elite 50 crore club had it released a week earlier.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu