అ..ఆ: త్రివిక్రమ్‌ను బ్లేమ్ చేయొద్దు: అసలు వాస్తవం ఇదీ

By Bojja Kumar

హైదరాబాద్: త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'అ..ఆ' చిత్రం గురువారం గ్రాండ్ గా రిలీజైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై షాకింగ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా స్టోరీలైన్ ఓ నవల నుండి కాపీ కొట్టారంటూ ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమా మెయిన్ లైన్.... ఒక ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి తన నేటివ్ విలేజ్ కి వెళ్లి అక్కడ తన బావతో ప్రేమలో పడుతుంది. ఈ లైన్ తో పాటు సినిమాలోని చాలా సీన్లు ప్రముఖ నావలిస్ట్ యద్దనపూడి సులోచనారాణి రాసిన నవల 'మీనా' నుండి కాపీ కొట్టారని కొందరు సినిమాపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు.

వాస్తవానికి ఈ సినిమా స్టోరీ లైన్ ఆ నవల నుండి తీసుకున్నదే. అయితే కాపీ కొట్టలేదు. ఆ నవల నుండి రైట్స్ తీసుకుని ఈ సినిమాకు వాడుకున్నారు. ఇకనైనా సినిమాపై ఇలాంటి ప్రచారం ఆపాలని త్రివిక్రమ్ అభిమానులు కోరుతున్నారు.

 'A..Aa' loosely based on the popular novel Meena

సినిమా విషయానికొస్తే.... గురువారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకులను ఆకట్టుకునే విధంగా ఉందనే టాక్ రావడంతో ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమాచూడటానికి క్యూ కడుతున్నారు.

మహేష్ బాబు బ్రహ్మోత్సవం చూడాలని ఆశగా ఎదురు చూసి నెగెటివ్ టాక్ రావడంతో ఆగిపోయిన ఫ్యామిలీ ప్రేక్షకులంతా 'అ...ఆ' సినిమా చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమాకు టికెట్స్ బుకింగ్ జోరుగా సాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X