»   » ఫ్యామిలీ ప్రేక్షకులకు పండగే...‘అ ఆ’ సెన్సార్ రిపోర్ట్

ఫ్యామిలీ ప్రేక్షకులకు పండగే...‘అ ఆ’ సెన్సార్ రిపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ సమ్మర్లో ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ కోసం కుటుంబ ప్రేక్షకులు చాలా ఆశగా ఎదురు చూసారు. ఇటీవల విడుదలైన 'బ్రహ్మోత్సవం' బాక్సాఫీసు వద్ద ప్లాప్ టాక్ తెచ్చుకోవడం, సినిమా బాలేదంటూ సోషల్ మీడియాలో కూడా తీవ్రంగా ప్రచారం జరుగడంతో చాలా మంది ఫ్యామిలీ ప్రేక్షకులు నిరాశకు లోనయ్యారు.

'బ్రహ్మోత్సవం' తర్వాత ఫ్యామిలీ ప్రేక్షకులు బాగా ఆశలు పెట్టుకున్న చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న 'అఆ' సినిమా మీదనే. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎటువంటి కట్స్ లేకుండా సినిమా క్లీన్ యు సర్టిఫికెట్ సొంతం చేసుకొంది. జూన్ 2న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. క్లీన్ సర్టిఫికెట్ రావడంతో ఈ సినిమాపై ప్రక్షకుల్లో అంచనాలు పెరిగాయి.

A..Aa Movie censor report

త్రివిక్రమ్ నుండి ఫ్యామిలీ ఎంటర్టెనర్ అంటే మంచి హాస్యం మేళవించిన కుటుంబ కథతో సాగుతుంది. 'అ ఆ' ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల నమ్మకాన్ని ఏమేరకు నిలబెడుతుందో చూడాలి.

త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంతనాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయిక గా ' అనుపమ పరమేశ్వరన్'(మలయాళ చిత్రం 'ప్రేమమ్' ఫేం) నటిస్తున్నారు. చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో .. నదియ,అనన్య,ఈస్వరీరావు,సన, గిరిబాబు, నరేష్,రావురమేష్ ,పోసాని, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి లు నటిస్తున్నారు.

English summary
Trivikram Srinivas’ upcoming family entertainer A..Aa is gearing up for a grand release on June 2nd.According to the latest update, the film has been censored with ‘U’ certificate.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu