»   » త్రివిక్రమ్ ‘అ..ఆ’ టీజర్ వచ్చేసింది (వీడియో)

త్రివిక్రమ్ ‘అ..ఆ’ టీజర్ వచ్చేసింది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్' రూపొందిస్తున్న చిత్రం 'అ ఆ'. ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాలను కధానాయకుడు నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అఫీషియల్ టీజర్ రిలీజైంది.

ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) మాట్లాడుతూ ..'మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలం నుండి జాలువారిన ఒక మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ చిత్రాన్నిప్రేక్షకులు మే లో చూడబోతున్నారు అని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ సందర్భం గా తెలిపారు. మిక్కీజె. మేయర్ సంగీతం సంగీత ప్రియులను అలరిస్తుం దని అన్నారు. ఏప్రిల్ మొదటివారంలో చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. మరోవైపు చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 6 న చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు.

A Aa Official Teaser

త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంతనాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయిక గా ' అనుపమ పరమేశ్వరన్'(మలయాళ చిత్రం 'ప్రేమమ్' ఫేం) నటిస్తున్నారు. చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో .. నదియ,అనన్య,ఈస్వరీరావు,సన, గిరిబాబు, నరేష్,రావురమేష్ ,పోసాని, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి లు నటిస్తున్నారు.

English summary
A Aa official teaser. Starring Nithin and Samantha in the lead roles. Directed by Trivikram Srinivas, produced by S. Radha Krishna on the Haarika & Hassine Creations banner. Music composed by Mickey J Meyer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu