»   »  త్రివిక్రమ్ చాలా ప్రెషర్ పెట్టారు: సమంత (అ..ఆ టీం స్పెషల్ ఇంటర్వ్యూ)

త్రివిక్రమ్ చాలా ప్రెషర్ పెట్టారు: సమంత (అ..ఆ టీం స్పెషల్ ఇంటర్వ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'అ..ఆ' సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నకొద్దీ ప్రమోషన్ల జోరు పెరిగింది. తాజాగా చిత్రంలోని ముఖ్య నటీనటులతో స్పెషల్ ఇంటర్వ్యూ షూట్ చేసి రిలీజ్ చేసారు. ఇందులో నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్, రావు రమేష్, పోసాని తదితరులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

గతంలో కంటే దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాలో నాపై చాలా ప్రెషర్ పెట్టారని సమంత చెప్పుకొచ్చారు. మరి త్రివిక్రమ్ ఎందుకు అలా చేసారు? సినిమా గురించి ఎవరు ఏం చెప్పారు? అనేది వీడియోలో చూడండి.

నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం అ..ఆ. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అనే సబ్ టైటిల్ తో రూపొందుతున్న ఈచిత్రం జూన్ 2న విడుదల చేస్తున్నారు.

A Aa Team Interview with Nithin, Samantha, Anupama Parameshwaran

ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎటువంటి కట్స్ లేకుండా సినిమా క్లీన్ యు సర్టిఫికెట్ సొంతం చేసుకొంది. త్రివిక్రమ్ నుండి ఫ్యామిలీ ఎంటర్టెనర్ అంటే మంచి హాస్యం మేళవించిన కుటుంబ కథతో సాగుతుంది. 'అ ఆ' ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల నమ్మకాన్ని ఏమేరకు నిలబెడుతుందో చూడాలి.

త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంతనాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయిక గా ' అనుపమ పరమేశ్వరన్'(మలయాళ చిత్రం 'ప్రేమమ్' ఫేం) నటిస్తున్నారు. చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో .. నదియ,అనన్య,ఈస్వరీరావు,సన, గిరిబాబు, నరేష్,రావురమేష్ ,పోసాని, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి లు నటిస్తున్నారు.

English summary
Watch A Aa Team Interview with Nithin, Samantha, Anupama Parameshwaran.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu