»   » వీడియో: 'బాహుబలి- 2 ' ట్రైలర్ స్వతంగా కట్ చేసి వదిలాడు, బాగుంది

వీడియో: 'బాహుబలి- 2 ' ట్రైలర్ స్వతంగా కట్ చేసి వదిలాడు, బాగుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌'. 2015 జులై 10న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన 'బాహుబలి: ది బిగినింగ్‌' చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతోంది.

'బాహుబలి' అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారతీయ చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూలేని భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ అంచనాలకు తగ్గట్టుగా ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల మన్ననలు పొందింది. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపు..బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ జరుగుతోంది.


ఈ చిత్రం విడుదల కోసం టీమ్ ఎంత ఎదురుచూస్తోందో... అభిమానులు అంతకన్నా ఎక్కువగా ఎదురుచూపులతో ఉన్నారు. కొంతమంది అభిమానులు ఉత్సాహం పట్టలేక, తమకు తెలిసి ఉన్న ఎడిటింగ్ నాలెడ్జ్ తో ఫ్యాన్స్ ట్రైలర్స్ ని కట్ చేస్తూ అందరి మన్ననలూ పొందుతున్నారు. ఇదిగో తాజాగా ఓ అభిమాని కట్ చేసిన ట్రైలర్ ని ఇక్కడ చూడండి. ఈ ట్రైలర్ కు సోషల్ మీడియాలో మంచి అప్లాజ్ వస్తోంది.


A Fan Made His Own Baahubali 2 Trailer!

అయితే ఎండలకు ఇబ్బంది పడుతూనే షూటింగ్ చేస్తున్న టీమ్ ఓ నెల పాటు శెలవులు సైతంప్రకటించారు. అలాగే ..'బాహుబలి: ది కంక్లూజన్‌'కి విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజర్‌గా ఆర్‌.సి.కమల్‌కన్నన్‌ పనిచేయబోతున్నారు. ఇదివరకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మగధీర', 'ఈగ' చిత్రాలకి కమల్‌ కన్నన్‌ నేతృత్వంలోనే వీఎఫ్‌ఎక్స్‌ పనులు జరిగాయి. ఇప్పుడు మళ్లీ ఆయనతో కలిసి పనిచేయబోతున్నారు. 'బాహుబలి - ది బిగినింగ్‌'కి శ్రీనివాస్‌ మోహన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సమకూర్చారు.


మరి 'బాహుబలి' రెండో భాగం ఎలా ఉండబోతోంది అంటే ''బాహుబలి - ది కంక్లూజన్‌' వచ్చాక 'బాహుబలి - ది బిగినింగ్‌' చాలా చిన్నదిగా కనిపిస్తుంది. రెండో భాగంలో పోరాట సన్నివేశాలు, భావోద్వేగాలు, సెట్లు... ఇలా అన్నీ ఇంకా భారీగా ఉంటాయ''న్నాడు రానా.


రాజమౌళి సృష్టించిన అపురూప దృశ్యకావ్యం 'బాహుబలి'ని చూసి మురిసిపోనివారు లేరు. ఈ సినిమా హిందీ వెర్షన్‌ను చాలా మంది బాలీవుడ్‌ నటులు వీక్షించారు. రాజమౌళి పనితీరు, నటీనటుల ప్రతిభను తెగ పొగిడేస్తోంది బాలీవుడ్‌.

English summary
A fan made Baahubali-2 promo has emerged which is taking our curiosity levels much higher.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X