»   »  చిరు ఫ్యాన్స్ కో సినిమా

చిరు ఫ్యాన్స్ కో సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu
Chiranjeevi
చిరంజీవి రాజకీయ ప్రవేశానికి అభిమాన సంఘాలే ప్రథాన పాత్ర పోషించబోతున్నాయని అందరికి తెలిసిందే.అలాగే ఇప్పటికే వారు రక్తదానం వంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకువెళ్తున్నారు.అలాగే అనుకోని పరిస్ధితుల్లో వారి అభిమానం శృతిమించి ఒక్కోసారి గొడవలూ జరుగుతున్నాయి.దాంతో చిరంజీవి రాజకీయ ప్రవేశ సమయంలో వీటిని సమీక్షిస్తూ ఎటువంటి పొరపాట్లు భవిష్యత్ లో జరగకుండా ఉండేటట్లు నియమావళి రూపొందించాలని ఆలోచించారట.కాని అభిమానులు లక్షల సంఖ్యలో ఉండటంతో అందరికి ఒకే సారి చెప్పటం కష్టమని భావించి ఓ ఆలోచన చేసారు. అదే సినిమా తీయటం. దాని ద్వారా తేలిగ్గా తామివ్వబోయే సూచనలు,సలహాలు అందించాలని నిర్ణయించుకున్నారట..... అందులో అభిమానులు ఇక నుంచి ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయాలి..అనే దానిపైనే దృష్టి కేంద్రీకరించి తీస్తారట.

కోడి రామకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా నాగబాబు పాత్ర చుట్టూ తిరుగుతుంది. కథలో నలుగురు చిరంజీవి అభిమానులకు ఎలా నడచుకోవాలనే సంగతి నాగబాబు పాత్ర తెలియజేస్తుంది. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేస్తున్న ఈ సినిమా ఆగస్టులో విడుదలవుతుంది. చిరంజీవి అభిమాని ..నంద్యాలకు చెందిన పారిశ్రామికవేత్త అయిన భాస్కరరెడ్డి రుష్య ప్రొడక్షన్స్ బానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గతంలోనూ ఇలాంటిదే శ్రీనుగాడు...చిరంజీవీ ప్యాన్ అనే సినిమా వచ్చింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X