»   » గమనించారా? : ఆ వార్నింగ్ లు లేకుండా సూర్య '24'

గమనించారా? : ఆ వార్నింగ్ లు లేకుండా సూర్య '24'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గత కొద్ది కాలంగా స్మోకింగ్, డ్రింకింగ్ వార్నింగ్ లు సినిమా ధియేటర్లో ప్రేక్షకులను విసిగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాటిని తప్పించుకునే మార్గం మేకర్స్ కు కనపడటం లేదు. గవర్నమెంట్ తప్పనిసరిగా అలాంటి సీన్స్ ఉంటే తప్పకుండా ఆ వార్నింగ్ లు వెయ్యాల్సిందే అని రూల్ పెట్టింది. అయితే ఈ మాండటరీ ని తాజాగా వచ్చిన సూర్య 24 చిత్రం తప్పించుకుంది. అదెలా అంటారా...

సూర్య 24 చిత్రం మొన్న శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం ప్రారంభంలో ఆ ఎడ్వర్టైజ్ మెంట్ కనపడలేదు. ఎందుకూ అని ఎంక్వైరీ చేస్తే... ఈ సినిమాలో ఏ పాత్ర కూడా స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ చేసినట్లు దర్శకుడు ఎక్కడా చూపలేదు. ఆ అవసరం కథ రీత్యా ఎక్కడా కనపడలేదు. దాంతో స్క్రీనింగ్ కు తప్పనిసరిగా వెయ్యాల్సిన యాడ్స్ నుంచి తప్పించుకోవటం సాధ్యమైంది.


A Film With No Smoking & Drinking Warning

ఇక సూర్య హీరోగా 'మనం' చిత్ర దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం '24'. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈచిత్రం మే 6న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైన సంగతి తెలిసిందే. విడుదలైన తొలి రోజే ఈచిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సౌత్ లో వచ్చిన ఓ బ్రిలియంట్ మూవీగా సినీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది.


సూర్యకు దక్షిణాది మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో అందుకు తగిన విధంగానే సినిమాను భారీగా రిలీజ్ చేసారు. తొలి రోజు బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించింది. సౌత్ ఇండియాన, నార్త్ ఇండియా కలిపి ఈ చిత్రం తొలి రోజు రూ. 25 కోట్ల పైచిలుకు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. యూఎస్ఏ, ఇతర ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకుంటే వసూళ్లు రూ. 30 కోట్లు దాటే అవకాశం ఉంది.


A Film With No Smoking & Drinking Warning

రోటీన్ సినిమాలకు భిన్నంగా టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా దర్శకుడు స్టోరీ నేరేషన్ చేసిన తీరు అద్భుతంగా ఉండటం, టేకింగ్, నిర్మాణ విలువలు, గ్రాఫిక్స్ అద్భుతంగా ఉండటంతో సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈచిత్రం త్వరలోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

English summary
Audience is surprised to see there is no advertisement before Suriya 24 film screening starting.This is because of reason that no characters in the film can be seen smoking and drinking.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu