»   » ఆ రోజు చెన్నై హోరెత్తి పోతుంది: స్పైడర్ ఈవెంట్ తో కోలీవుడ్ లోకి ప్రిన్స్ గ్రాండ్ ఎంట్రీ

ఆ రోజు చెన్నై హోరెత్తి పోతుంది: స్పైడర్ ఈవెంట్ తో కోలీవుడ్ లోకి ప్రిన్స్ గ్రాండ్ ఎంట్రీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'స్పైడర్‌'. ఏఆర్‌.మురగదాస్‌ దర్శకుడు. ఈ చిత్రం తెలుగు, తమిళంలో విడుదల కాబోతోంది. తొలిసారి మహేశ్‌బాబు ఈ చిత్రానికి తమిళంలో డబ్బింగ్‌ చెప్పారు.సూపర్ స్టార్ మహేష్ -మురుగదాస్ కాంబినేషన్ లో మోస్ట్ ఎవెయిటింగ్ మూవీగా తెరకెక్కుతున్న 'స్పైడర్' ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఏకకాలంలో రూపొందుతుండడం, ఈ సినిమాతో మహేష్ కోలీవుడ్ కి పరిచయం కాబోతుండడంతో ఈ సినిమాకు సంబంధించి కోలీవుడ్ లో భారీ ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌

త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని చెన్నైలో ఏర్పాటు చేయనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. అంతేకాదు ఈ కార్యక్రమానికి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, దర్శకుడు శంకర్‌ ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారట. తమిళంలో స్పైడర్ తో అడుగుపెడుతున్న మహేష్ ని తమిళులకు పరిచయం చెయ్యాలి అంటే... ఆ పరిచయం ఒక రేంజ్ లో ఉండాలి.


Mahesh Babu's Spyder teaser creates record
గ్రాండ్ గా పరిచయం చెయ్యడం కోసం

గ్రాండ్ గా పరిచయం చెయ్యడం కోసం

అందుకే మహేష్ ని తమిళులలో గ్రాండ్ గా పరిచయం చెయ్యడం కోసం స్పైడర్ సినిమా ఈవెంట్ ని ఒకదాన్ని చెన్నై లో భారీ లెవల్లో ప్లాన్ చేస్తున్నారు స్పైడర్ చిత్ర యూనిట్ వాళ్ళు. సెప్టెంబర్ 9న చెన్నైలో స్పైడర్ సినిమాకి సంబందించిన ఒక ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతుంది. ఆ ఈవెంట్ లోనే మహేష్ పరిచయ కార్యక్రమం గ్రాండ్ లెవల్లో ఉండబోతుందని చెబుతున్నారు.


లైకా ప్రొడక్షన్స్‌

లైకా ప్రొడక్షన్స్‌

అందులోనూ రజనీ నటించిన ‘2.0' చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌ సంస్థే.. ‘స్పైడర్‌' థియేట్రికల్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. స్పైడర్ సినిమాకు కోలీవుడ్ లో కూడా విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఆ సినిమాకు మరింత క్రేజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ గ్రాండ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి యూనిట్ సభ్యులను తమిళ ప్రేక్షకులకు పరిచయం చేస్తారట.


వచ్చే నెల 9

వచ్చే నెల 9

వచ్చే నెల 9 న ఈ వేడుకను చెన్నై లో గ్రాండ్ గా జరిపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఆ స్టేజ్ పైకి మహేష్ ఎలా రావాలి, ఎలా కనిపించాలి వంటి అంశాలపై ఇప్పటికే ఓ స్పెషల్ కాన్సెప్ట్ ను డిజైన్ చేసి పెట్టారట కూడా. మరి మహేష్ తమిళ పరిచయ కార్యక్రమం మాములుగా ఉండదట.


ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తుంది

ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తుంది

తమిళలుకి ఎప్పటికి గుర్తుండిపోయేలా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారట. టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో పేరు సంపాదించి.... చాలామంది తమిళ సినీ ప్రముఖులకు సన్నిహితుదుగా ఉన్న మహేష్ తమిళ పరిచయ కార్యక్రమం కోసం ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటే తమిళనాడు అంతా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తుంది.English summary
Spyder Team will be hosting a grand launch event in Chennai on September 9 to mark the entry of Telugu Cinema’s Superstar Mahesh Babu in Kollywood
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu