»   » రాజ్‌త‌రుణ్‌-హెబ్బా పటేల్ హాట్రిక్ కొడతారేమో...(ఫోటోస్)

రాజ్‌త‌రుణ్‌-హెబ్బా పటేల్ హాట్రిక్ కొడతారేమో...(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.10గా కుమారి 21 ఎఫ్‌, ఈడోరకం-ఆడోర‌కం వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ జంట‌గా రూపొందుతోన్న చిత్రం అంధ‌గాడు.

ఇటీవ‌ల సినిమా లాంచ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. స‌క్సెస్‌ఫుల్ రైట‌ర్ వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈచిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ప్రారంభ‌మైన ఈ చిత్రం గ్యాప్ లేకుండా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాలో. న‌ట‌కిరిటీ డా.రాజేంద్ర‌ప్రసాద్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు.

 ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత రామ‌బ్ర‌హ్మం సుంక‌ర మాట్లాడుతూ

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత రామ‌బ్ర‌హ్మం సుంక‌ర మాట్లాడుతూ

``హీరో రాజ్‌త‌రుణ్‌తో మా బ్యాన‌ర్ మంచి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను రూపొందించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో మ‌రోసారి రాజ్‌త‌రుణ్ క‌థానాయ‌కుడుగా వెలిగొండ శ్రీనివాస్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం అంధ‌గాడు. డిఫ‌రెంట్ ,స్ట్రాంగ్ అండ్ ఎగ్జ‌యిట్‌మెంట్ పాయింట్‌తో సినిమా అంతా ర‌న్ అవుతుందన్నారు.

 హాట్రిక్ మూవీ

హాట్రిక్ మూవీ

క‌థ విన‌గానే రాజ్ త‌రుణ్ సినిమా చేయ‌డానికి వెంట‌నే అంగీక‌రించారు. కుమారి 21ఎఫ్‌, ఈడోర‌కం-ఆడోర‌కం హిట్ చిత్రాల త‌ర్వాత రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ జోడి న‌టిస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది అని నిర్మాత తెలిపారు.

వెలిగొండ శ్రీనివాస్

వెలిగొండ శ్రీనివాస్

అలాగే రైట‌ర్ వెలిగొండ శ్రీనివాస్‌గారు ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌య‌మ‌వుతున్న సినిమా కూడా అంధ‌గాడు కావ‌డం విశేషం. సినిమా ప్రారంభ‌మైన రోజు నుండి ఏ గ్యాప్ లేకుండా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను వ‌చ్చే ఏడాది వేస‌వి సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. సినిమా బాగా వ‌స్తుంది. మంచి టీం కుదిరింది. క‌థ ప‌రంగా సినిమాను గ్రాండ్‌గా నిర్మిస్తున్నాం. సినిమా త‌ప్పకుండా అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే విధంగా ఉంటుంది`` అన్నారు నిర్మాత

 నటీనటులు, టెక్నీషియన్స్

నటీనటులు, టెక్నీషియన్స్


రాజ్‌త‌రుణ్‌, హెబ్బాప‌టేల్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఆశిష్ విద్యార్థి, రాజా ర‌వీంద్ర‌, షాయాజీ షిండే, స‌త్య‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర రావు త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః బి.రాజ‌శేఖ‌ర్‌, ఆర్ట్ః కృష్ణ మాయ‌, చీఫ్ కోడైరెక్ట‌ర్ః సాయి దాసం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కిషోర్ గ‌రిక‌పాటి, స‌హ నిర్మాతః అజ‌య్ సుంక‌ర‌, నిర్మాతః రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు,దర్శ‌క‌త్వంః వెలిగొండ శ్రీనివాస్‌.

English summary
Hit pair Raj Tarun and Hebah Patel teamed up once again for 'Andhhagadu', which is being produced under A.K.Entertainments India Pvt.Ltd banner as production no.10. Successful writer Veligonda Srinvas is turning director for this movie and Rajendra Prasad is playing a key Role. The shooting commenced on 26th October and has been going on non stop at a rapid pace since then. The makers are aiming for a Summer, 2017 release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu