For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ టాపిక్ : ‘నాయక్‌’ కి అన్నీ మైనస్‌లే?

  By Srikanya
  |

  హైదరాబాద్: ఈ సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న రామ్ చరణ్ తాజా చిత్రం 'నాయక్‌'. ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్నీ మైనస్ లు అంటూ ఓ పాపులర్ తెలుగు దిన పత్రిక ఓ కథనం ప్రచురించింది. అయితే వారు చెప్పిన మైనస్ లు నిజంగా సినిమా పై ప్రభావం చూపెడతాయా. నిజంగా అవి మైనస్ లు అయితే వాటిని ప్లస్ లు గా మార్చే కెపాసిటీ మెగా క్యాంప్ కు లేదా..ఇదే ఇండస్ట్రీలో చాలా మంది వద్ద జరుగుతున్న చర్చ. ఇంతకీ ఆ పత్రికలో ఈ చిత్రంలో పేర్కొన్న మైనస్ లు ఏమిటి అంటే... ఆ కథనం యధాతధంగా..

  తెలంగాణ ఉద్యమం ఉధృతం కానున్న ప్రస్తుత తరుణంలో..ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చెర్రీ 'నాయక్‌'కి పంచ్‌ పడనుందా? ..తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని దెబ్బతీసేలా తెరకెక్కించిన 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'(సీజీఆర్‌) తరహాలో ఈ చిత్రం కూడా ఉంటుందా? అంటే అవుననే వెల్లడవుతోంది. పవన్‌కళ్యాణ్‌ నటించిన 'సీజీఆర్‌' నిర్మాత నుంచి వస్తున్న చిత్రమే గనుక 'నాయక్‌'పైనా అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. పైగా ఇప్పటికే తమన్‌ పరమ రొటీన్‌ స్వరాలతో శ్రోతలకి బోరు కొట్టించాడు. ఆడియో అతిపెద్ద మైనస్‌. 'ఏ' సర్టిఫికెట్‌ మరో అదనపు మైనస్‌. అభిమానులు సైతం ఈ మ్యూజిక్‌ టేస్ట్‌ ఏమిటో జీర్ణించుకోలేని పరిస్థితి. అదేగాక.. ఉస్మానియాలో 'నాయక్‌' టైటిల్‌పై వివాదాల రచ్చ కొనసాగుతూనే ఉంది.

  ఓ వర్గానికి చెందిన టైటిల్‌ని సినిమా టైటిల్‌ని చేయడం వివాదాస్పదమైంది. పైగా సమైక్యవాదిగా ముద్రపడిన కాంగ్రెస్‌ నేత చిరంజీవి ప్రభావమూ ..నైజాం మార్కెట్లో అంతో ఇంతో 'నాయక్‌' పై పడే అవకాశం లేకపోలేదు. 'ఎ' సర్టిఫికెట్‌తో శృతిమించిన హింస కూడా ఈ చిత్రంలో ఉందనే ప్రచారమూ సదా సాగుతోంది. ఇదే సమయంలో పోటీబరిలో వస్తున్న మహేష్‌-వెంకీ మల్టీస్టారర్‌ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం టీజర్‌, ఆడియో నుంచి అన్నిటా..పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళుతోంది. 'నాయక్‌'కి కేవలం రెండు రోజుల గ్యాప్‌లో విడుదలవుతున్న ఈ చిత్రం గట్టి పోటీనే ఇవ్వనుంది. ఇన్ని ప్రతికూలతల మధ్య 'నాయక్‌' ఎలా నెట్టుకొస్తాడో ..వేచి చూడాలి! ఉద్యమ సెగ తగలకుండా సినిమాని సినిమాగా చూసే సంస్కృతి అంతరించి చాలాకాలమే అయింది గనుక..డియర్‌ 'నాయక్‌' జర భద్రం!

  ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌రావత్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: తమన్‌.

  English summary
  Coming with a tagline "The Leader", Ram Charan's Naayak will be a racy action entertainer and is scheduled for release for 2013 Sankranthi. Kajal Agarwal and Amala Paul are playing the female leads while SS Thaman is scoring the music. DVV Danayya is producing the movie under Universal Media banner.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X