»   »  షూటింగ్ లో పేకాడుకుంటూ కూర్చుంటే ...దాసరి వార్నింగ్

షూటింగ్ లో పేకాడుకుంటూ కూర్చుంటే ...దాసరి వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Dasari Narayana Rao
దాసరి నారాయణరావు నిన్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ''నటుల్లో క్రమశిక్షణ లోపిస్తోంది. ఇష్టమొచ్చిన సమయానికి వచ్చి పేకాడుకుంటూ కూర్చుంటే సహించలేం. అలాంటివారిని దూరం పెట్టడానికి నిర్మాతలందరం సిద్ధంగా ఉన్నామ''ని ఆయన హెచ్చరించారు. ''ఇక్కడ సమయపాలన కూడా ఎంతో ముఖ్యం. అది లేకపోతే నటించడం మానుకోవాలి. అని అన్నారు. అలాగే 'మా'లో సభ్యుడిగా నాకు గుర్తింపు లేదు. దాదాపు 70 సినిమాల్లో నటించాను.

అయినా దాసరికి 'మా'కీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. నిజానికి ఈ సంఘం ఆవిర్భావానికి కారకుడిని నేను'' అన్నారు. 'మా' అధ్యక్షుడు మురళీమోహన్‌ మాట్లాడుతూ ''పరభాషా నటులు చాలా మంది ఈ సంఘంలో సభ్యులు కావడంలేదు. వారందరికీ సభ్యత్వం తీసుకోమని చెబుతున్నాం. పేద కళాకారుల్ని ఆదుకొనేందుకు కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. పరిశ్రమ అభివృద్ధికి అన్నీ సంఘాల వారితోనూ సమష్టిగా కృషి చేస్తామ''ని పేర్కొన్నారు. ఈ వేదికపైనే ఇటీవల జాతీయ స్థాయి పురస్కారాలు పొందిన 'హోప్‌', 'కమ్లి', 'కిట్టు' చిత్ర బృందాల్ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో రామానాయుడు, ఆహుతి ప్రసాద్‌, జయసుధ, ఏవీయస్‌, పి.సుకన్య, భార్గవ తదితరులు పాల్గొన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X