»   » కబాలి 217 రోజులు నడిపాను, మీ దుష్ప్రచారం ఆపండీ..కోలీవుడ్‌లో కలకలం

కబాలి 217 రోజులు నడిపాను, మీ దుష్ప్రచారం ఆపండీ..కోలీవుడ్‌లో కలకలం

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ సినిమాలోని ఏడుగురు అగ్ర హీరోలపై రెడ్‌కార్డ్‌ ప్రయోగించ బోతున్నట్టు కొన్ని రోజులుగా ఒక వదంతి షికారు చేస్తోంది. అయితే అదంతా అవాస్తవమని, అలా ఏ హీరోకి రెడ్‌కార్డ్‌ చూపలేదని ప్రముఖ పంపిణీదారుడు తిరుప్పూర్‌ సుబ్రమణ్యం వివరణ ఇచ్చారు. అసలు ఈ రెడ్‌కార్డ్‌ వ్యవహారం తెరపైకి రావడానికి కారణం... సమీపకాలంలో అగ్రహీరోలు నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడి, ఆ చిత్రాలను విడుదల చేసిన పంపిణీ దారులకు నష్టాలను మిగిల్చిన సందర్భాలుడడమే.

ముఖ్యంగా భారీ అంచనాల నడుమ విడుదలైన 'కబాలి' ఎక్కువ నష్టాలను తీసుకువచ్చినట్టు వినిపిస్తోంది. ఈ సినిమా కలెక్షన్లపై వాస్తవాలు రజనీకాంత్ కు తెలియవని కోలీవుడ్ పంపిణీదారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో సేఫ్ జోన్ లో ఉండాలంటే ఏడుగురు అగ్రహీరోలపై రెడ్ కార్డ్ ప్రయోగించాలన్న చర్చ నడుస్తోంది. కానీ, నిర్మాత కలైపులి ఎస్‌.థాను మాత్రం వందల కోట్లు వసూలు చేసినట్టు అధి కారికంగానే ప్రకటించారు.


A whatsapp voice clip is Trending in kollywood about kabaali

దీనిపై పలువురు పంపిణీదారులు అసం తృప్తి వ్యక్తం చేస్తున్నారు.'కబాలి' సినిమాకు సంబంధించిన వాస్తవాలు రజనీకాంత్‌కు తెలుసా అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం పై మదురైకి చెందిన పంపిణీదారుడు ఒకరు రెండ్రోజుల క్రితం వాట్సాప్‌ ద్వారా ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో... మదురైలో తనకు సొంతమైన థియేటర్‌లో 'కబాలి' 217 రోజులు ప్రదర్శిత మైనట్టు తెలిపారు.


'ఈ రోజు కూడా కబాలి మార్నింగ్‌ షో 47 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. రెగ్యులర్‌గా జనం వస్తున్నారు.మీరు చేసిన ఆరో పణలు థాను సార్‌ను, రజనీ సార్‌ను అవమానపరిచేలా వున్నాయి. నేనూ ఒక పంపిణీదారుణ్నే.ఒక థియేటర్‌ యజమానినే. ఏదేని ఒక వ్యాపారంలో లాభనష్టాలు సహజం.ఇలా ప్రత్యేకంగా కొంతమంది పేర్లు చెప్పి దుష్ప్రచారం చేయడం దురదృష్టకరం. 'కబాలి' ఘనవిజయం సాధించింది.మదురై ఏరియాలో లాభాలు తెచ్చిపెట్టింది' అని ప్రకటిం చారు. ప్రస్తుతం ఈ ఆడియో కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

English summary
A whatsapp voice clip is Trending in kollywood about kabaali that a theater woner from palakkad
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu